Hens : నాటు కోళ్ళలో… బాహ్య, అంతర పరాన్న జీవుల నివారణ

కోళ్ళు రోజంతా బయటి ప్రదేశాల్లో తిరుగుతాయి. కాబట్టి అంతరపరాన్న జీవులైన ఏలికపాములు, నట్టల బెడద ఎక్కువగా ఉంటుంది.

Chiken (1)

Hens : నాటుకోళ్ళ పెంపకం ద్వారా కుటుంబానికి గుడ్డు, మాంసం వంటి పౌష్టికాహారం లభించటమే కాకుండా ఆదనపు ఆదాయం లభిస్తుంది. మార్కెట్‌లో బ్రాయిలర్‌ కోళ్ళ కంటే నాటుకోళ్ళ మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కేజి నాటు కోడి ధర 300 నుండి 400 రూపాయల వరకు ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వీటి పెంపకంపై, ఆరోగ్యంపై అవగాహన తక్కువ. నాటుకోళ్ళ పెంపకంపై శ్రద్ధ కనబరచకపోవడం వల్ల తమకు ఇెలియకుండానే పరోక్షంగా రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా నాటుకోళ్ళకు ఇంటి పరిసరాలు, పొలాల్లోన్ని గింజలు, పురుగుల్ని ఏరుకుని తింటాయి. కలుషితమైన నీరు తాగుతాయి. అందువల్ల ఇవి తొందరగా బాహ్య అంతరపరాన్నజీవులకు బెడదకు గురవుతాయి. చూడడానికి ఇది చిన్న సమస్య, కాని దీనివల్ల చాలా నష్టం కలుగుతుంది. ముఖ్యంగా అంతరపరాన్న జీవుల ధట్టలు వల్ల కోళ్ళు సరిగ్గా పెరగవు, బలంగా ఉండవు. బాహ్యపరాన్న జీవులైన నల్లలు, పేలు, మైట్స్‌ వల్ల ఉత్పత్తి తగ్గిపోతుంది.

కోళ్ళు ఎంత తిన్నా పెరగవు. రక్తహీనతకు గురవుతాయి. కోళ్ళకు పేలు పట్టడం, నట్టలు పడటం వంటి సమస్యలు వచ్చిన సందర్భంలో నివారణ చర్యల గురించి అంతగా పట్టించుకోము. రైతు సోదరులు వీటి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఎంతో లబ్ది పొందవచ్చు. మనకు అందుబాటులో ఉండే కొన్ని నివారణ చర్యల గురించి తెలుసుకుందాం.

బాహ్యపరాన్న జీవుల నివారణ:

1. కోళ్ళ గూడును కనీసం 2-3 రోజులకొకసారైనా శుభ్రం చేయాలి.

2 కోళ్ళ గూడులో బూడిద గాని, సున్నం గాని చల్లాలి.

3. వారానికి ఒకసారి గూడులో పొగ బెడితే బాహ్యపరాన్న జీవులను తగ్గించవచ్చు.

4 కోళ్ళను కమ్మదానికి ఉపయోగించే గంపలను రోజంతా ఎండలో పెడితే కొంత వరకు వీటి బెడద ఎక్కువ ఉండే పైరిత్రిన్‌ (బ్యూటాక్స్‌) అనే మందు (1 మి.లీ మందు 11 లీటరు నీటిలో) కలిపీ కోళ్ళ పై చల్లాలి.

5.కార్బరిల్‌ అనే మందును కోళ్ళ గూడు, గోడలు నేలపైన చల్లాలి.

6. పేను బెడద ఎక్కువగా ఉంటే, ఒక బ్యాగులో కార్బరిల్‌ లేదా గమాక్సిన్‌ను తీసుకొని, కోడి మెడ భాగం బయటకి, మిగతా. భాగం బ్యాగ్‌లో ఉంచి అటూ ఇటూ తిప్పాలి. ఈ చిట్కా ద్వారా పేను బెడద తొందరగా పోతుంది.

7 ఇలాంటి మందులు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందాలి.బ్యూటాక్స్‌ స్ర్పే చేసేటవ్వుడు తల భాగానికి తగలకుండా, అంటకుండా చల్లాలి. బూడిదను కూడా చల్లి, కొంత వరకు నివారించవచ్చు.

కోళ్ళు రోజంతా బయటి ప్రదేశాల్లో తిరుగుతాయి. కాబట్టి అంతరపరాన్న జీవులైన ఏలికపాములు, నట్టల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు కోళ్ళకు సంవత్సరానికి 2-3 సార్లు ప్రెపరాజిన్‌ అనే మందును తాగే నీళ్ళలో కలిపి తాగిస్తే అంతర పరాన్న జీవులను నివారించవచ్చు. మన దగ్గరలో ఉన్న వశు వైద్యశాలలో పైపరాజిన్‌ అనే మందును ఉచితంగా ఇస్తారు. రైతులు ఈ మందును కోళ్ళకు తాగించి మన నాటుకోళ్ళను నట్టల బారి నుండి కాపాడుకోవచ్చు.