Oil Farm Cultivation : వంట నూనెలకు పెరుగుతున్న డిమాండ్ నేపధ్యంలో ఆయిల్ ఫామ్ సాగు దిశగా అన్నదాతలు!

ఒక్కసారి పంట వేసుకుంటే 30 సంవత్సరాల దాకా రైతుకు నిరంతరం దిగుబడి వస్తుండటం దీంతో పాటు అంతరపంటలు సాగు చేయటం ద్వారా అదనపు అదాయం పొందుతుండటంతో రైతులకు ఈ పంట లాభసాటిగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

Oil Farm Cultivation : వంట నూనెలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతులు ఆయిల్ ఫామ్ సాగువైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయిల్‌ ఫామ్‌ సాగుకు రైతులకు ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సీడీలు అందిస్తుంటడటంతో రైతులు ఈ పంటసాగువైపు ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో రైతులు అయిల్ పామ్ సాగు చేపట్టగా మరికొందరు ఆదిశగా అడుగులు వేస్తున్నారు. ఒక్కసారి పంట వేసుకుంటే 30 సంవత్సరాల దాకా రైతుకు నిరంతరం దిగుబడి వస్తుండటం దీంతో పాటు అంతరపంటలు సాగు చేయటం ద్వారా అదనపు అదాయం పొందుతుండటంతో రైతులకు ఈ పంట లాభసాటిగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

తొలి ఏడాది ఎకరాకు సుమారుగా రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. 4 నుంచి 10 ఏండ్ల వరకు ఏటా రెండు టన్నుల చొప్పున దిగుబడి పెరుగుతూ వస్తుంది. 10 ఏండ్ల నుంచి 35 ఏండ్ల వరకు సుమారు 12 నుంచి 16 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. రైతు సస్యరక్షణ చర్యలను బట్టి దిగుబడి ఎకరాకు 20 టన్నుల వరకు సైతం వచ్చే అవకాశం ఉంటుంది. పొలంలో 9X9 చొప్పున దూరంలో ఎకరానికి 50 మొక్కల వరకు పెట్టవచ్చు.

బాగా పెరిగిన పామాయిల్‌ తోటలో ఎకరానికి సుమారుగా ఏడాదికి 15 టన్నుల పంట దిగుబడి వస్తుంది. కనీసంగా రూ.15 వేల చొప్పున గెలలు విక్రయించినా రూ.2,25,000 వస్తుంది. రూ.45 వేల వరకు ఖర్చులు పోతే.1.80 లక్షల మేర రైతులకు గిట్టుబాటు అవుతుంది. మరోవైపు అంతర పంటల ద్వారా సైతం భారీ లా భాలు అర్జించే అవకాశం ఉంది. అంతా కలిపి ఎకరాకు రూ. 3 లక్షల వరకు అదాయం వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే కొన్ని ప్రవేట్ ఆయిల్ కంపెనీలు రైతులను ఆయిల్ ఫామ్ సాగువైపు ప్రోత్సహిస్తున్నాయి. పంటకు కావాల్సిన పెట్టుబడిని సమకూరుస్తున్నాయి. పంట చేతికి వచ్చాక ఆపంటను కొనుగోలు చేసే బాధ్యతను సైతం తీసుకుంటున్నాయి. దీంతో రైతులకు పండించిన పంటపై తగిన భరోసా ఉండటంతో అయిల్ ఫామ్ సాగువైపు దృష్టిసారిస్తున్నారు. ఖాళీగా ఉన్న మెరక ప్రాంతంలో ఆయిల్‌ పామ్‌ సాగు అన్ని విధాలా మేలు. నీటి ఎద్దడి ఉన్న భూములలో డ్రిప్‌ ద్వారా సాగు చేయవచ్చు.

ట్రెండింగ్ వార్తలు