Rice Cultivation : వరిలో అధిక దిగుబడులకోసం సమగ్ర యాజమాన్యం

సాధారణ పరిస్థితుల్లో వరి పంటకు  3 నుండి 4 దఫాలుగా  ఎరువులు వాడాలి .  కానీ భూసారాన్నిబట్టి నిర్ధేశించిన మోతాదులో ఎరువుల వాడకం జరగటం లేదు. కొందరు రైతులు అవసరమైన దాని కంటే ఎక్కువగాను, మరి కొందరు తక్కువగాను ఎరువులు అందిస్తున్నారు.

Rice Cultivation

Rice Cultivation : ఈ ఏడాది రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో.. వరి సాగుకూడా అలస్యమైంది. చాలాచోట్ల వరినారుమడులను ఆలస్యంగా పోసుకున్నారు. కొన్నిచోట్ల నేరుగా వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేపడుతున్నారు.కొన్ని  చోట్ల వరినాట్లు పడ్డాయి. మరి కొన్ని ప్రాంతాలలో రైతులు ఇప్పుడిప్పుడే వరి నాట్లు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో వరి సాగులో అధిక దిగుబడి సాధించాలంటే  ఎరువులు, కలుపు, పురుగుల నివారణ కీలకం . అయితే ఏ సమయంలో.. ఎంత మోతాదులో ఎరువులు వేయాలో తెలియజేస్తున్నారు ఉయ్యూరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. ఎం. నంద కిషోర్.

READ ALSO : Cultivation of Mushrooms : ఏడాది పొడవునా ఆదాయం పొందే అవకాశం.. కుటీరపరిశ్రమగా పుట్టగోడుగుల పెంపకం

తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే పంటల్లో వరి సాగు విస్తీర్ణం అధికం. అన్ని జిల్లాల్లోను కాలువలు, చెరువులు, బోరుబావుల కింద సాగువుతోంది. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో వుండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల నాట్లు పడగా, మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరి నారుమడిదశలోనే ఉంది.

READ ALSO : Corn Crop : మొక్కజొన్నకు కత్తెరపురుగుల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్త సూచనలు

సాధారణ పరిస్థితుల్లో వరి పంటకు  3 నుండి 4 దఫాలుగా  ఎరువులు వాడాలి .  కానీ భూసారాన్నిబట్టి నిర్ధేశించిన మోతాదులో ఎరువుల వాడకం జరగటం లేదు. కొందరు రైతులు అవసరమైన దాని కంటే ఎక్కువగాను, మరి కొందరు తక్కువగాను ఎరువులు అందిస్తున్నారు. దీనివల్ల దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వరిసాగులలో  ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఎరువుల మోతాదును సిఫార్సు చేస్తున్నారు కృష్ణా జిల్లా,  ఉయ్యూరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. ఎం. నంద కిషోర్.

READ ALSO : Castor Cultivation : ఆముదం సాగులో మెళకువలు

వరి పంటలో రైతులను కలుపు మొక్కల సమస్య వేధిస్తుంది. ఒక వైపు కూలీల కొరత, మరో వైపు  వానలతో కలుపు మొక్కలు రో జురోజుకూ అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటాయి. అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. చీడపీడలు ఉధృతమవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి నివారణకు ఎలాంటి సమగ్ర యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం..

READ ALSO : China : చైనా వరదల్లో 21 మంది మృతి, ఆరుగురు గల్లంతు

వరిసాగులో ఎరువుల యాజమాన్య కీలకమే. అయితే ఎరువుల వినియోగంలో రైతులకు సరైన అవగాహన లేనందువల్ల అటు ఆర్థికంగా, ఇటు దిగుబడుల పరంగా నష్టపోతున్నారు. నీటి యాజమాన్యంతో పాటు  రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంలోనూ తగిన మెళకువలు తప్పనిసరిగా పాటించాలి.

ట్రెండింగ్ వార్తలు