Vegetable Crops
Vegetable Crops : స్వల్పకాలంలో, తక్కువ ఖర్చుతో ఆదాయం చేతికొచ్చే పంటలలో కూరగాయలది మొదటిస్థానంగా చెప్పుకోవచ్చు. ధరల్లో హెచ్చుతగ్గులున్నా, ఒక కోతలో కాకపోతే మరోకోతలో.. ఒకపంటలో కాకపోతే మరో పంటలో అధిక ధరలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఖరీఫ్ కూరగాయలు సాగుచేసే రైతులు నాణ్యమైన అధిక దిగుబడులను పొందాలంటే నారుమడి నుండి పంట కోత వరకు మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు పొలాస అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ , అసిస్టెంట్ ప్రొఫెసర్, డా. కె. స్వాతి.
READ ALSO : Toor dal Cultivation : కందిపంటను ఆశించే పేనుబంక, ఆకుగూడు పరుగులు.. నివారణ పద్దతులు
మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ముఖ్యమైనది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి మూడు కాలాల్లో సాగు చేస్తారు. రబీ , వేసవితో పోలిస్తే ఖరీఫ్‌లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనాల రాక నుంచి రుతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జూలై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలలో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి రుతుపవనకాలం అంటారు.
READ ALSO : Turmeric Cultivation : సేంద్రీయ పసుపు సాగులో ఎరువులు, నీటి యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. అయితే కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారుపోసి తర్వాత పొలంలో నాటాలి. నాణ్యమైన అధిక దిగుబడిని పొందాలంటే మొదటి నారుపెంపకంపై జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు పొలాస అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ , అసిస్టెంట్ ప్రొఫెసర్, డా. కె. స్వాతి.
వాతావరణ మార్పులు కారణంగా పలు కూరగాయల పంటలకు వివిధ రకాల తెగుళ్లు, పురుగులు ఆశిస్తున్నాయి. ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఆశించి తీవ్రనష్టం చేస్తున్నాయి. కాబట్టి నారుమడి నుండి ప్రధాన పొలంలో నాటే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. నాటాకా చీడపీడల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త.