Cashew Plantation : జీడితోటల్లో అంతర పంటలసాగు – తక్కువ పెట్టుబడితో అదనపు ఆదాయం 

Cashew Plantation : పార్వతీపురం మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, మక్కువ, సాలూరు, పాచిపెంట మండలాల్లో ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో అధికంగా జీడితోటలు వ్యాపించి ఉన్నాయి.

Inter Crops In Cashew Plantation

Cashew Plantation : ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతంలో అత్యధికంగా జీడి పంట సాగవుతోంది. అయితే, ప్రతీ ఏడాది వేసవిలో మాత్రమే ఈ పంటదిగుబడి వస్తుండటంతో.. గిరిజన రైతులు అంతరపంటలపై ద్రుష్టి సారిస్తున్నారు. ఈ అంతరపంటల వలన ఏడాది పొడవునా ఆదాయం సమకూరడంతో పాటు జీడితోటల నిర్వహణ, పెంపకానికి ఎంతో దోహదపడుతుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల కాలంలో ఉద్యాన శాఖ అధికారుల సూచనలను పాటిస్తూ.. జీడిలో అంతరపంటలను వేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు రైతులు.

పార్వతీపురం మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, మక్కువ, సాలూరు, పాచిపెంట మండలాల్లో ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో అధికంగా జీడితోటలు వ్యాపించి ఉన్నాయి. గిరిజనులు వీటిని సాగు చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఒక్క మన్యం జిల్లాలోనే కాకుండా, ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 70వేల హెక్టార్లలో ఈ జీడితోటలు విస్తారంగా సాగవుతున్నాయి. ప్రతీ ఏడాది జీడిపంట ద్వారానే ఇక్కడ గిరిజనులు అధికాదాయం పొందుతున్నారు.

అయితే, వేసవిలో మాత్రమే ఈ పంట చేతికొస్తుంది. మిగిలిన సమయంలో జీడి తోటల్లో తుప్పలు, డొంకలు, కలుపుమొక్కలు ఏపుగా పెరిగిపోయి, నిర్వహణ లేకుండా పోతుంటాయి. అంతరపంటలు సాగుచేస్తే అన్ని విధాలుగా రైతులకు మేలు జరుగుతుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అంతర పంటలుగా కొన్ని రకాల పంటలను మాత్రమే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. మరి అవేంటో పార్వతిపురం మన్యం జిల్లా, రస్తకుటుంబాయి  కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరాజు ద్వారా తెలుసుకుందాం..

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు