Inter Crop : అంతర పంటలసాగు… ప్రయోజనాలు

తెలుగు రాష్ట్రాలు  అంతర పంటలు సాగుచేసుకునేందుకు అనుకూలమనే చెప్పాలి. సాలీన 650 నుండి 750 మి.లీ వర్షపాతం పడే ప్రాంతాల్లో భూమిలోపలి పొరల్లో తేమ నిల్వచేసుకునే శక్తి 100మి.మీ కన్నా ఎక్క

Inter Crop : వ్యవసాయంలో నూతన పద్దతలను పాటించేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది రైతులు తమ క్షేత్రాల్లో ప్రధాన పంటతోపాటు, అంతర్ పంటలను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలా చేయటం వల్ల రైతులకు అదనపు అదాయంతోపాటు, పెట్టుబడి ఖర్చులను తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.

అంతర పంటలు సాగుచేయడం ద్వారా ప్రధాన పైరు మొక్కల మధ్య వున్న స్థలం వృధా కాకుండా ఉపయోగపడునట్టు చేయవచ్చును. స్థలమే కాకుండా సూర్యరశ్మి,నీరు పోషకాలు కూడా బాగా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అనుకోని ప్రకృతి వైపరీత్యాల వలన ఒక పైరు దెబ్బతిన్న మరో పైరు ఎంతో కొంత దిగుబడి వచ్చి రైతును కష్టకాలంలో ఉపయోగపడుతుంది. అంతా సవ్యంగా ఉంటే రెండు పైర్ల నుండి కూడా అధిక దిగుబడులను పొందవచ్చును.

అంతర పంటలు సాగు ద్వారా కీటకాలు ,తెగుళ్ళు,కలుపు మొక్కల బెడద కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయి. ఈ తరహా సేధ్యంలో అపరాల జాతికి చెందినవైతే,ప్రధాన పంటలకు కొంత మేర నత్రజని అందే అవకాశం వుంది. అంతర పంటలు సాగు ద్వారా చిరుధాన్యాలు,నూనె గింజలు,పప్పుధాన్యాలు మొదలైన పంటల ఉత్పత్తి పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల నేలకోత తగ్గుతుంది.

తెలుగు రాష్ట్రాలు  అంతర పంటలు సాగుచేసుకునేందుకు అనుకూలమనే చెప్పాలి. సాలీన 650 నుండి 750 మి.లీ వర్షపాతం పడే ప్రాంతాల్లో భూమిలోపలి పొరల్లో తేమ నిల్వచేసుకునే శక్తి 100మి.మీ కన్నా ఎక్కువగా ఉంటే అలాంటి నేలలు అంతర పంటల సాగుకు అనుకూలమని చెప్పవచ్చు. ప్రధాన పంటతోపాటు అంతర పంటగా వేసే పంటను సరైన నిష్పత్తిలో వేసుకోవాలి. ప్రధాన పంట నుండి దిగుబడిని తీసుకుని, అంతర పంట నుండి దిగుబడి పొంది తద్వారా లాభం పొందేందుకు ప్రయత్నించాలి.

ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఇప్పటికే ప్రధాన పంటల్లో కొన్ని రకాల అంతరపంటలను సాగుచేస్తున్నారు. వాటి వివరాలను పరిశీలిస్తే వేరుశనలో అంతరపంటగా కంది సాగు, ఆముదంలో అంతరపంటగా కంది సాగు, మొక్కజొన్నలో అంతరపంటగా కంది సాగు, జొన్నలో అంతరపంటగా కందిసాగు, సజ్జపంటలో అతరపంటగా కంది సాగు, పెసర,మినపలో అంతరపంటగా కంది సాగు, పత్తిపంటలో అంతరపంటగా సోయా చిక్కుడు, పత్తిపంటలో అంతరపంటగా కంది, ఆముదంలో అంతరపంటగా వేరుశనగ ఇలా అంతరపంటలు సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు