Seed Purification : పంట వేసే ముందు విత్తనశుద్ధి తప్పనిసరా? విత్తనశుద్ధితో బహుళ ప్రయోజనాలు!

విత్తనం లోపల ఆశించిన శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తనశుద్ధికి ఉపయోగించే వుందు, విత్తనం లోపలి భాగంలోకి చొచ్చుకొనిపోయి శిలీంధ్రాలు నిర్మూలించ బడుతాయి

Seed Purification : నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రాలు రాకుండా పురుగు మందు లేదంటే తెగులు మందును పొడిరూపంలో గాని, ద్రవ రూపంలో గాని విత్తనానికి పట్టించే విధానాన్ని విత్తనశుద్ధి అంటారు. కొన్ని సందర్భాలలో మందులనే కాకుండా, విత్తనాలను సూర్యరశ్మికి గురిచేయడం, వేడి నీళ్ళలో ఉంచడము కూడా విత్తనశుద్ధిగానే పరిగణిస్తారు. విత్తనశుద్ధి వల్ల పంటకు ప్రయోజనాలు కలుగుతాయి.

విత్తన శుద్ధితో ప్రయోజనాలు ;

1. మొలకెత్తే విత్తనాలను, లేత మొక్కలను విత్తనము ద్వారా లేదా నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుండి కాపాడుకోవచ్చు.

2. పప్పజాతి పంట మొక్కల వేర్లపై బుడిపెల సంఖ్య పెరుగుతుంది.

3. తక్కువ ఖర్చుతో, తెగుళ్ళు, పురుగులను అదుపులో ఉంచవచ్చు.

4. విత్తనశుద్ధి చేసినపుడు, నిల్వ చేసినపుడు ఆశించే పురుగుల నుండి కూడా రక్షణ పొందవచ్చు.

5. ముఖ్యంగా నేలద్వారా సంక్రమించే తెగుళ్ళను, పురుగు లను సమర్థవంతంగా నివారించవచ్చు.

6. విత్తనం లోపల ఆశించిన శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తనశుద్ధికి ఉపయోగించే వుందు, విత్తనం లోపలి భాగంలోకి చొచ్చుకొనిపోయి శిలీంధ్రాలు నిర్మూలించ బడుతాయి

7. విత్తన పై భాగంలో ఆశించిన శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తనశుద్ధి మందును, విత్తనంపై, పొడి రూపంలో గాని, లేదా ద్రవ రూపంలో కాని పట్టించినప్పుడు పై పొరల్లో ఉన్న శిలీంధ్రాలు నిర్మూలించబడతాయి.

8. విత్తనాలు/మొలకెత్తిన లేత మొక్కలు నేలలో ఉన్న శిలీంధ్రముల నుండి రక్షణ పొందుతాయి.

ట్రెండింగ్ వార్తలు