Kandi Cultivation : ప్రస్తుతం కందిలో చేపట్టాల్సిన సస్యరక్షణ

Kandi Cultivation : ఖరీఫ్‌‌లో వర్షాధారంగా సాగయ్యే దీర్ఘకాలిక పప్పుజాతి పంట కంది. బెట్ట పరిస్థితులను సమర్ధంగా తట్టుకుని, అతి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు అందించే పంటగా పేరుగాంచింది.

Kandi Cultivation

Kandi Cultivation : తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా సాగవుతున్న పంటల్లో పత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పప్పుధాన్యపు పంట కంది. బెట్ట పరిస్థితులను సమర్థంగా తట్టుకుని, ఖరీఫ్, రబీకాలాల్లో రైతుకు మంచి ఫలితాలు అందిస్తోంది. ఖరీఫ్ లో విత్తిన కంది ప్రస్థుతం పూత, కాయ దశలో వుంది. పంటలో కాయ అభివృద్ధి చెందే కీలకమైన ఈ దశలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యాకిషోర్.

ఖరీఫ్ లో వర్షాధారంగా సాగయ్యే దీర్ఘకాలిక పప్పుజాతి పంట కంది. బెట్ట పరిస్థితులను సమర్ధంగా తట్టుకుని, అతి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు అందించే పంటగా పేరుగాంచింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం ఆలస్యంగా విత్తుకునేందుకు అనువైన ఈ పంట, వివిధ పంటల్లో అంతరపంటగా సైతం సులభంగా ఇమిడిపోయి రైతుకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది.

ఖరీఫ్ లో విత్తిన కంది ప్రస్థుతం, పూత, కాయ అభివృద్ధి చెందే దశలో ఉంది. కీలకమైన ఈ దశలో ప్రధానంగా చీడపీడల బెడద ఎక్కువ వుంటుంది. అయితే పూత, పిందె దశలో పురుగుల నివారణే అతి కీలకం. 100 రోజుల పాటు శాకీయంగా అభివృద్ది చెందిన కందిలో పూత, పిందె దశ రెండు నెలలపాటు ఉంటుంది. కాబట్టి ఈ దశలో ఆశించే చీడపీడలను సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించాలని రైతులకు సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యాకిషోర్.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు