Cow Based Products : సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి గోశాల ఏర్పాటు.. గో ఆధారిత ఉత్పత్తుల తయారీ

గో ఆధారిత ఉత్పత్తులకు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తుండటంతో ఎగుమతులు చేస్తున్నారు. త్వరలోనే మచిలీపట్నంతో పాటు విజయవాడ సమీపంలోని పొరంకి, హైదరాబాద్​లో మరోక రెండు స్వదేశీ మందిర్ దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు కృషి తెలిపారు.

cow based products

Cow Based Products : మంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. నెలకు లక్షపైనే జీతం.. అయినా సంతృప్తి లేదు అతనికి.. ఆవు విశిష్టత గురించి తెలియడంతో.. ఉద్యోగంలో కొనసాగలేకపోయారు. విమర్శలు ఎన్ని ఎదురైనా..  విజయం సాధించగలననే నమ్మకంతో..  గోశాలను ప్రారంభించారు. గోవును నమ్ముకున్నవారెవరూ చెడిపోరన్నట్టుగా గోశాల బ్రాండ్ నేమ్ తోనే గో ఆధారిత ఉత్పత్తుల తయారీ చేపట్టి.. కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తూ.. నేటి యువతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ఇంతకీ ఎవరతను.. ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కారణమేంటీ… తెలియాలంటే మనం మచిలీపట్నానికి వెళ్లాల్సిందే..

READ ALSO : Cotton Cultivation : పత్తికి తొలిదశలో ఆశించే చీడపీడల నివారణ

శ్రీమత్ జగత్ గురు మధ్వాచార్య గోవిద్యాకేంద్రం ఇందులో వన్నీ దేశీ ఆవులే. వీటి నుండి వచ్చే వ్యర్థాలు, పాలను ఉపయోగించి గోఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు కృష్ణా జిల్లా, మచిలీపట్నంకు చెందిన వడ్డీ కృషి.  పేరుకు తగ్గట్టే కృషీవలుడయ్యాడు. కార్పోరేట్ కొలువును తృణపాయంగా వదిలి, స్వయంగా పరిశ్రమను నెలకొల్పి.. తాను ఉపాధి పొందడమే కాకుండా.. పదిమందికి పనికల్పిస్తున్నారు.

READ ALSO : Cabbage Cultivation : క్యాబేజి సాగులో మేలైన యాజమాన్యం.. మార్కెట్ కు అనుగుణంగా సాగుచేస్తే మంచి లాభాలు

మచిలీపట్నానికి చెందిన కృషి ఎంసీఏ చదివారు. కొన్నేళ్లపాటు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేశారు. నెలకు లక్షపైనే జీతం వచ్చేది. ఖాళీ సమయాల్లో ప్రకృతి వ్యవసాయం, సహజ సిద్ధ ఆహార ఉత్పత్తుల వంటి వాటిపై ఆసక్తి పెంచుకుని సేంద్రియ వ్యవసాయం చర్చల్లో పాల్గొనేవారు. పాలేకర్, రాజీవ్ దీక్షిత్ ప్రసంగాలను స్పూర్తిగా తీసుకుని సేంద్రియ వ్యవసాయంలో నూతన మార్గాలు, గో ఆధారిత ఉత్పత్తులు ఉత్పత్తి చేయాలని భావించారు. పట్టణానికి సమీపంలోని సీతారాంపురం గ్రామంలో అర ఎకరం పొలం కొనుగోలు చేసి, 2015 సంవత్సరంలో ఒక్క ఆవుతో 1 గోశాల ప్రారంభించారు. ప్రస్తుతం చిన్నా, పెద్దా కలుపుకొని అక్కడ 50 గోవులు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 80 రకాల గోఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పాలు, పెరుగు, నెయ్యి, పంచకాలతో 80 రకాల ఉత్పత్తుల తయారీతో కుటీర పరిశ్రమను విస్తరించారు.

READ ALSO : Kakara Sagu : శాశ్వత పందిర్లపై కాకర సాగు.. ఎకరాకు రూ. 80 వేల నికర ఆదాయం

తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాల కోసం స్వదేశీ మందిర్ పేరుతో మచిలీపట్నంలో ఒక దుకాణాన్ని ఏర్పాటు చేశారు. తన ఉత్పత్తుల విక్రయాలకు గోశాల ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయించారు. గో ఆధారిత ఉత్పత్తులకు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తుండటంతో ఎగుమతులు చేస్తున్నారు. త్వరలోనే మచిలీపట్నంతో పాటు విజయవాడ సమీపంలోని పొరంకి, హైదరాబాద్​లో మరోక రెండు స్వదేశీ మందిర్ దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు కృషి తెలిపారు. గోశాల నిర్వహణలో ఆదర్శంగా నిలవడమే కాకుండా.. ఆసక్తి ఉన్న వారికి గోశాల పేరుతో శిక్షణ ఇస్తున్నారు.

READ ALSO : Bitter Gourd Cultivation : పందిరి కాకర సాగుతో.. అధిక లాభాలు పొందుతున్ననెల్లూరు జిల్లా రైతు

మారుతున్న జీవన శైలి,  కోత్త కోత్త రోగాలను పరిచయం చేస్తుంది. రసాయానాలతో పండించిన ఆహర పదార్థలను తినడంతో అనారోగ్యల బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అందుకే ఆరోగ్యం విష‌యంలో చాలా మంది శ్ర‌ద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నిత్యం వాడే వంట నూనెల విష‌యంలో చాలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అందులో భాగంగానే రీఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గానుగ‌లో ఆడించిన స‌హ‌జ‌సిద్ధ‌మైన నూనెల‌ను వాడేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే కృషి గానుగను ఏర్పాటు చేసి , సహాజ సిద్ధమైన నూనెలను ఉత్పత్తి చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు