Cucumber Cultivation
Cucumber Cultivation : స్వల్పకాలంలో, తక్కువ ఖర్చుతో ఆదాయం చేతికొచ్చే పంటలలో కూరగాయలది మొదటిస్థానంగా చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా దోస తక్కువ చీడపీడలు ఆశించి ఎక్కువ దిగుబడులు వస్తుండటంతో బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు మూడు ఎకరాల్లో సాగు చేపట్టాడు. ప్రస్తుతం మార్కెట్ అధిక రేటు పలుకుతుండటంతో.. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు.
READ ALSO : Carrot Cultivation : క్యారెట్ సాగులో నాణ్యమై దిగుబడి కోసం మెళకువలు
బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం, కొత్తపేట గ్రామానికి చెందిన రైతు గిరిప్రసాద్ 3 ఎకరాల్లో దోస సాగు చేస్తున్నాడు. ఈయన గత 6 ఏళ్లుగా తనకున్న పొలంలోనే ప్రణాళిక బద్ధంగా దోస పంటను సాగు చేస్తున్నాడు. డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులను అందిస్తున్నాడు.
READ ALSO : YCP Bus Yatra : వైసీపీ సామాజిక న్యాయ బస్సు యాత్ర.. మొదటి విడత షెడ్యూల్ విడుదల
ప్రస్తుతం పంట పూత, పిందె దశలో ఉంది. మరో 15 , 20 రోజుల్లో పంట దిగుబడులు ప్రారంభం కానున్నాయి. ఎకరాకు ఒక టన్ను వరకు దిగుబడి వచ్చే ఆస్కారం ఉంది. మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుండటంతో అధిక లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.