Fertilizers Cotton Crop : ప్రస్తుతం పత్తిలో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం

Fertilizers Cotton Crop : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయానుకూలంగానే పలకరించాయి. అనంతరం వరుణుడు ముఖం చాటేశాడు.. అడపా దడప కురుస్తున్న వర్షాలకు చాలా వరకు రైతులు పత్తిని విత్తారు.

Management of Fertilizers in Cotton Crop

Fertilizers Cotton Crop : మెట్టప్రాంతాల్లో…  వర్షాధారంగా పత్తి సాగవుతోంది. ఇప్పటికే అన్నిచోట్ల పత్తిని విత్తుకున్నారు రైతులు. అయితే కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ గింజలు మొలకెత్తలేదు. ఈ సమయంలో పత్తిసాగు సమాంతరంగా పెరిగేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి.. అలాగే అధిక సాంధ్రత పద్ధతిలో సాగుచేసిన పత్తిలో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ రాహుల్ విశ్వకర్మ.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయానుకూలంగానే పలకరించాయి. అనంతరం వరుణుడు ముఖం చాటేశాడు.. అడపా దడప కురుస్తున్న వర్షాలకు చాలా వరకు రైతులు పత్తిని విత్తారు. కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో మొక్కల ఎదుగుదల నిలిచిపోయింది. మరికొన్ని చోట్ల కొన్ని విత్తన గింజలు మొలకెత్తలేదు. ఈ సమయంలో.. పత్తిలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి… ప్రస్తుతం ఆశించే చీడపీడలు ఏమిటి.. వాటిని ఏవిధంగా అరికట్టవచ్చో రైతులకు తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ రాహుల్ విశ్వకర్మ.

సాధరణ పద్ధతిలో పత్తి సాగు చేస్తే పంట జనవరి, ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. దీంతో గులాబీరంగు పురుగు ఆశించి పంటను దెబ్బతీస్తుంది. దీంతో భారీగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి . ఈ నేపధ్యంలోనే తక్కువ విస్తీర్ణంలో… ఎక్కువ మొక్కలు నాటి.. తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే అధిక సాంధ్రత పద్ధతిలో పత్తిసాగును చేస్తున్నారు కొందరు రైతులు. ఈ విధానంలో తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించవచ్చు. అయితే అధిక సాంద్రత పద్ధతిలో సాగుచేసే రైతులు  కొన్ని మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.

Read Also : Moong Dal Crop : పెసరలో ఎర్రగొంగళి పురుగుల బెడద.. నివారణకు చేపట్టాల్సిన చర్యలు

ట్రెండింగ్ వార్తలు