Bengalgram Cultivation : శనగ పంట సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్దతులు

విత్తుకునే ముందు విత్తన శుద్ది అనేది చాలా ప్రాముఖ్యం. థైరామ్‌ లేదా కాష్టాన్‌ ౩ గ్రా. లేదా కార్బండజిమ్‌ 2.5 గ్రా. లేదా వాటి వాక్స్‌ పవర్‌ 1.5 గ్రా. కిలో విత్తనంలో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

Bengalgram Cultivation

Bengalgram Cultivation : శీతాకాలంలో మంచు అధారంగా మిగులు తేమను ఉపయోగించుకుంటూ నల్లరేగడి నేలల్లో రబీలో పండించే పంట శనగ. నీరు నిలవకుండా చౌడు లేని, తేమ బాగా పట్టి ఉంచే సారవంతమైన, మద్యస్ధ నల్లరేగడి నేలలు మరియు ఉదజని నూచిక 6-7 ఉండే నేలలు ఈ వంట సాగుకు అనుకూలం.

READ ALSO : Groundnut Crop : వేరుశనగ పంటలో కాండం కుళ్ళు తెగులు నివారణ

విత్తుకునే ముందు భూమిని నాగలితో లేదా కల్టివేటర్‌తో ఒకసారి, తరువాత గొర్రుతో రెండు సార్లు మెత్తగా దున్ని చదునుచేసి విత్తుటకు సిద్ధం చేయాలి. పశువుల ఎరువు 10 టన్నులు, గంధకం 16 కిలోలు, నత్రజని 8 కిలోలు, మరియు భాస్వరపు ఎరువులు 20 కిలోలు ఎకరాకు అఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. విత్తే ముందు భూమిలో సరిపడా తేమ ఉండేటట్లు చూసుకోవాలి.

కాబూలీ రకాలు:

కె.ఎ.కె.2 : పంట కాలం 95- 100 రోజులు కలిగి ఉండి, ఎకరానికి 8-10 క్వింటాళ్ళ దిగుబడిని పొందవచ్చు.

ఐ.ని.ని.వి.-2 (శ్వేత) : ఎండు తెగులును తట్టుకునే స్వల్పకాలిక రకం

విత్తన మోతాదు:

విత్తన బరువును బట్టి విత్తన మోతాదు ఎకరాకు మారుతుంది. దేశవాళీ రకాలలో ఎకరానికి 25-30 కిలోలు మరియు కాబూలీ రకాల్లో 45-60 కిలోలు అవసరమవుతుంది.

READ ALSO : Peanut Crop : వేరుశనగ పంటను ఆశించు పురుగులు – నివారణా చర్యలు

విత్తన శుద్ధి:

విత్తుకునే ముందు విత్తన శుద్ది అనేది చాలా ప్రాముఖ్యం. థైరామ్‌ లేదా కాష్టాన్‌ ౩ గ్రా. లేదా కార్బండజిమ్‌ 2.5 గ్రా. లేదా వాటి వాక్స్‌ పవర్‌ 1.5 గ్రా. కిలో విత్తనంలో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. శనగను మొదటిసారిగా పొలంలో సాగు చేసేటప్పుడు మొదట శిలీంద్ర నాశిని మందులతో శుద్ధిచేసి ఆరబెట్టిన తర్వాత రైజోబియం కల్చర్‌ను విత్తనాలకు పట్టించాలి. దీనికై ఎనివిది కిలోల విత్తనానికి 200 గ్రాములు రైజోవియం మిశ్రమాన్ని 300 మి.లీ. నీటిలో, 10 శాతం బెల్లం మిశ్రమాన్ని పట్టించి బాగా కలిపి నీడలో ఆరబెట్టుకొని విత్తుకోవాలి. ఎండు తెగులు సమస్యాత్మకంగా ఉన్న భూముల్లో ట్రైకోడెర్మా విరిడి 8 గ్రా. కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.

విత్తేదూరం :

సాళ్ళ మధ్య 20 సెం.మీ. మరియు మొక్కల మధ్య 10 సెం.మీ. ఉండేలా చూసుకోవాలి. లావు గింజలైన కాబూలీ రకాలు విత్తినపుడు సాళ్ళ మధ్యన 45 సెం.మి. దూరంలో విత్తుకావాలి. మొక్కల నారయద్రత ఎకరాకు 1,33,333 ఉండేటట్లు జాగ్రత్త వహించినట్లయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. విత్తనాన్ని నాగలి లేదా గొర్రుతో సాళ్ళ పద్దతిలో విత్తుకోవాలి. భూమిలో సరైన తేమశాతం ఉండేలా చూసుకొని 5-8 సెం.మీ. లోతులో పడేలా విత్తుకోవాలి. యాంత్రికంగా ట్రాక్టర్‌ కల్టివేటరు లేదా సీడ్‌ డ్రిల్‌ కమ్‌ ఫెర్టిలైజర్‌ బోదె కాలువల పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు.

శనగలో అంతరపంటలుగా మొక్కజొన్న-శనగ, జొన్న-శనగ, పెసర/మినుము-శనగ, సోయా చిక్కుడు-శనగ, నువ్వులు- శనగ మరియు శనగ + ధనియాలు వేసుకోవచ్చు.

READ ALSO : Diseases in Groundnut : వర్షాధారంగా ఖరీఫ్ వేరుశనగ సాగు.. అధిక దిగుబడుల కోసం సమగ్ర సస్యరక్షణ

కలుపు యాజమాన్యం ;

విత్తిన 30 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తేముందు ఫ్లూక్లోరాలిన్‌ 45% ఎకరాకు1-1.2 లీ. చాప్పున 200 లీ. నీటిలో కలిపి నేలపై పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి. అదే విధంగా విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు మొలకెత్తక ముందే “పెండిమిథాలిన్‌ 30% ఎకరాకు 1.3-1.6 లీ. / 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. విత్తిన ౩0 నుండి ౩5 రోజుల దశలో గొర్రుతో అంతర కృషి చేసి కలువు నివారించుకోవచ్చు.

నీటి యాజమాన్యం :

నేలలోని తేమను బట్టి 1 లేదా 2 తేలికపాటి తడులు ఇవ్వాలి. నీటి తడులు పెట్టేటప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. పూత దశకు ముందు అనగా విత్తిన 30 నుండి 35 రోజులకు ఒకసారి మరియు గింజ కట్టే దశలో విత్తిన 55 నుండి 65 రోజులకు ఒకసారి తడులను అందిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు.