Organic Fertilizers
Organic Fertilizers : అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా వ్యవసాయంలో.. భూములు సారాన్ని కోల్పోయి నిర్జీవం అవుతున్నాయి. వస్తున్న దిగుబడులకన్నా, వేస్తున్న రసాయన ఎరువులే అధికం. ఇలాంటి సమయంలో భూసారాన్ని పెంచి నాణ్యమైన దిగుబడులను తీయాలంటే సేంద్రియ ఎరువుల వాడకం తప్పనిసరి. సేంద్రియ ఎరువులంటే ఒక పశువుల ఎరువే కాదు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్ట్ కూడా వస్తాయి. వానపాముల విసర్జితమే వర్మీకంపోస్ట్. ఈ వర్మికంపోస్ట్ ను 10 ఏళ్లుగా తయారు చేస్తూ.. స్వయం ఉపాధిని ఏర్పరుచుకున్నారు ఓ మహిళా.. మరి ఆమె ఎలాంటి వర్మీకంపోస్ట్ తయారు చేస్తోంది.. అందులో ఏమేమి కలుపుతోంది. మార్కెటింగ్ ఎలాచేస్తోందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..
READ ALSO : Rice Cultivation : వరిలో అధిక దిగుబడులకోసం సమగ్ర యాజమాన్యం
రసాయన ఎరువులు, పురుగు మందుల్ని విచక్షణారహితంగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు… భూమిలో ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోతోంది. ఫలితంగా భూసారం క్షీణించడం, భూ భౌతిక లక్షణాలు కనుమరుగవడం, పంట నాణ్యత దెబ్బతినడం, దిగుబడి పడిపోవడం, వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వంటి ప్రతికూల పరిణామాలు చోటుచేసుకుంటూ.. రైతన్నను కలవరపెడుతున్నాయి.
READ ALSO : Cultivation of Mushrooms : ఏడాది పొడవునా ఆదాయం పొందే అవకాశం.. కుటీరపరిశ్రమగా పుట్టగోడుగుల పెంపకం
ఈ పరిస్థితుల్లో సేంద్రియ ఎరువుల వాడకానికి ప్రాధాన్యత పెరిగింది. దీనిని ముందుగానే పసిగట్టిన రంగారెడ్డి జల్లా, బడంగ్ పేట్ మండలం, నాదర్ గగుల్ గ్రామానికి చెందిన రైతు గుత్తా జ్యోతి వెంకట్ రెడ్డి 10 ఏళ్లుగా వర్మీకంపోస్ట్ తయారుచేసి అమ్ముకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. సాధారణంగా గుంతల్లో తయారుచేసే కంపోస్టు.. వినియోగంలోకి రావటానికి కనీసం 6 నెలల నుండి సంవత్సరం పడుతుంది. కానీ కేవలం నెల రోజుల్లో వానపాముల ఎరువు తయారవుతుంది. పైగా ఈ సేంద్రీయ ఎరువులో ప్రధాన పోషకాలతో పాటు, సూక్ష్మపోషకాల లభ్యత ఎక్కువ వుంటుంది.
READ ALSO :ఎడమ చేతివాటం ఉన్న ప్రముఖులు
మనం పంటలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాష్ పోషాకాలను వేరువేరుగా అందించాలి. వీటి ఖర్చు కూడా భారీగా పెరిగిపోయింది. కాబట్టి రైతులు ఈపోషకాలన్నీ ఒకేచోట లభ్యమయ్యే వర్మీకంపోస్టు వంటి సేంద్రీయ ఎరువులను విరివిగా వాడితే రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతో డిమాండ్ నానాటికీ పెరుగుతుండటంతో వర్మీ కంపోస్టు తయారీని ఉపాధి అవకాశంగా మలుచుకున్నారు జ్యోతి.
READ ALSO : Twins : ఆ స్కూల్లో ఎక్కువమంది కవలలే.. ఈసారి 17 సెట్ల కవలలు జాయిన్ అయ్యారు .. ఎక్కడంటే
వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత నానాటికీ పెరుగుతోంది. సహజ సిధ్దంగా నత్రజని, భాస్వరం, పొటాష్ లను మొక్కలకు అందుబాటులోకి తేవటంలో ఇవి కీలక భూమికను పోషిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు, రకరకాల రసాయనాలతో భూమి కలుషితమై రానురాను నిస్సారంగా తయారవుతోంది. ఈ విపరీత పరిణామాల నుంచి భూమి యెక్క ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు, రైతు వ్యవసాయంలో పెట్టే పెట్టుబడిని తగ్గించుకుని, సుస్థిరమైన వ్యవసాయాన్ని కొనసాగించేందుకు ఈ జీవన ఎరువులు తోడ్పడుతున్నాయి. అందుకే జీవన ఎరువులను వర్మీకంపోస్ట్ లో కలిపి రైతులకు అందిస్తోంది జ్యోతి.
READ ALSO : Flying Alien: ఎగురుతూ వచ్చిన 7 అడుగుల ఏలియన్, యువతి ముఖం తినేశాడట.. ఫొటో కూడా చూపిస్తున్న స్థానికులు
పంటల వ్యర్థాలు.. పశువులపేడ కాదేదీ సంపదకు అనర్హమంటుంది జ్యోతి. వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చే ప్రక్రియను పక్కాగా అమలు చేయడంతోపాటు జ్యోతి ఆర్గానిక్స్ పేరుతో సేంద్రియ ఎరువులను తయారు చేసి 10 ఏళ్లుగా విక్రయాలు ప్రారంభించింది. చిన్న చిన్న అవసరాలకు ప్రభుత్వం వైపు చూడకుండా ఉన్న వనరులతో సంపద సృష్టించుకోవటం ద్వారా తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది .