Sesame Cultivation : నువ్వుసాగులో మేలైన యాజమాన్యం

Sesame Cultivation : పత్తి పంట తీసిన ప్రాంతాల్లో రెండో పంటగా అతితక్కువ పెట్టుబడి, అతితక్కువ సమయంలో వచ్చేనువ్వు పంటను సాగుచేసి మంచి దిగుబడులను తీయవచ్చు.

measures on to expand cultivation of sesame management

నీటి వసతి వున్న రైతాంగం  వేసవి పంటగా నువ్వుసాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా వుండి దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి. అయితే రైతు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి వుంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువలు గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. మహేశ్.

Read Also : Pulses Cultivation : వేసవి అపరాల సాగులో మెళకువలు – అధిక దిగుబడులకు చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం  

ఫిబ్రవరి 15 వరకు నువ్వును విత్తుకోవచ్చు  :
నువ్వు, అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట. నువ్వు గింజల్లో నూనె 50 శాతం, ప్రొటీన్లు 20 నుండి 25 శాతం వరకూ ఉంటాయి. వేసవి కాలంలో రెండు మూడు తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ వుండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మనదేశం 2వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకూ వేసవి నువ్వును విత్తుతారు.

పత్తి పంట తీసిన ప్రాంతాల్లో రెండో పంటగా అతితక్కువ పెట్టుబడి, అతితక్కువ సమయంలో వచ్చేనువ్వు పంటను సాగుచేసి మంచి దిగుబడులను తీయవచ్చు. అంతేకాదు వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా వుంటుంది.  నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి.

ప్రస్థుతం మార్కెట్లో నువ్వులకు అధిక ధర పలుకుతుంది. అయితే అధిక దిగుబడులను సాధించాలంటే సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. మహేశ్.

Read Also : Vegetable Farming : కూరగాయ పంటల్లో పురుగులను అరికట్టే విధానాలు

ట్రెండింగ్ వార్తలు