Method of controlling weeds in crops
Controlling Weeds : తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది, పప్పుశనగ, వేరుశనగ, కుసుమ వంటి పంటలను సాగు చేస్తున్నారు రైతులు. ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురవడంతో భూమిలో ఉన్నటువంటి కలుపు మొక్కలు పంటలకు తీవ్ర నష్టం చేచే అవకాశం ఉంది.
కలుపు మొక్కలు పంటలో నీరు, పోషకాలు, సూర్యరశ్మికి పోటీపడుతూ పంట దిగుబడిని తగ్గిస్తాయి. పంట నాణ్యతను తగ్గిస్తాయి. కావున యాసంగిలో సాగుచేసే వివిధ పంటల్లోని కలుపు మొక్కల నివారణ పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. శ్రీధర్.
రైతులను కలుపు మొక్కల సమస్య వేధిస్తుంది. ఒక వైపు కూలీల కొరత, మరో వైపు ఇటీవల కురిసిన వానలతో కలుపు మొక్కలు అధికమై.. పంట ఎదుగుదలను అడ్డుకుంటున్నాయి. అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. దీంతో కలుపు నివారణ మందులపై రైతులు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి.
అయితే ఏ పైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి. సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్దితులలో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్ములన సరిగ్గా జరగక పోగా, కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వివిధ పంటల్లో ఆశించే కలుపు మొక్కలు వాటి నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. శ్రీధర్ .
తెలుగు రాష్ట్రాలలో వరి కోసిన తరువాత నేరుగా కాని , వరి తరువాత జీరో టిల్లేజ్ పద్ధతిలో కానీ లేదా సాధారణ పద్ధతిలో సాగుచేస్తూ ఉంటారు రైతులు . అయితే ఇందులో అధికంగా కలుపు వస్తూ ఉంటుంది. అలాగే తెలంగాణలో వరికి ప్రత్యామ్నాయంగా రబీలో వేరుశనగ పంటను రైతులు విత్తుతుంటారు. కలుపు ప్రధాన సమస్యగా మారుతుంది. దీని నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం..
Read Also : Backyard Poultry Farming : స్వయం ఉపాధి మార్గంగా పెరటికోళ్ల పెంపకం.. తక్కువ సమయం.. తక్కువ పెట్టుబడితో లాభాలు