Milky Mushroom Cultivation : కుటీరపరిశ్రమగా పుట్టగోడుగుల పెంపకం- ఏడాది పొడవునా ఆదాయం పొందే అవకాశం 

పుట్టగొడుగుల్లో అనేక రకాల వున్నప్పటికీ అధిక గిరాకీని కలిగి, తక్కువ ఖర్చుతో పెంచదగిన పాల పుట్టగొడుగుల పెంపకం లాభదాయకంగా వుంది.

Milky Mushroom Cultivation : కుటీరపరిశ్రమగా పుట్టగోడుగుల పెంపకం- ఏడాది పొడవునా ఆదాయం పొందే అవకాశం 

Milky Mushroom Cultivation Process

Milky Mushroom Cultivation : చిన్నతరహా కుటీర పరిశ్రమల్లో పుట్టగొడుగుల పెంపకం మెరుగైన ఉపాధి పరిశ్రమగా దినదినాభివృద్ధి చెందుతోంది. పుట్టగొడుగుల్లో వున్న విశిష్ఠ పోషక విలువలు, ఆరోగ్యానికి మేలుచేసే గుణాల వల్ల, వీటి గిరాకీ నానాటికీ పెరుగుతోంది. గ్రామాలే కాదు, పట్టణాల్లో కూడా వీటిని పెంచే వీలుండటంతో నిరుద్యోగ యువత కూడా ఈ పరిశ్రమ చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పుట్టగొడుగుల్లో అనేక రకాల వున్నప్పటికీ అధిక గిరాకీని కలిగి, తక్కువ ఖర్చుతో పెంచదగిన పాల పుట్టగొడుగుల పెంపకం లాభదాయకంగా వుంది.

Read Also : Bitter Gourd Cultivation : కాసుల కాకర సాగు.. అధిక లాభాలు పొందుతున్న నెల్లూరు జిల్లా రైతు

సంవత్సరం పొడవునా ఆదాయనిచ్చే వ్యవసాయ అనుబంధ రంగాల్లో పుట్టగొడుగుల పెంపకం మెరుగైన కుటీర పరిశ్రమగా విరాజిల్లుతోంది. గ్రామీణులకే కాదు, నిరుద్యోగ యువతకు కూడా చక్కటి ఉపాధి పరిశ్రమగా నిలుస్తోంది. పుట్టగొడుగుల్లో అధికశాతం ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్ లు వుంటాయి. పిండి పధార్దం అసలు వుండకపోవటం వీటి ప్రత్యేకత. విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా వున్నందువల్ల  పోషకాహారలేమితో బాధపడే మహిళలకు, పిల్లలుకు, గుండెజబ్బు వున్నవారికి మంచి ఆహారం. వీటిలో వందల రకాలు వున్నప్పటికీ మన రైతులు 4,5 రకాలను మాత్రమే పెంచుతున్నారు. వీటిలో ముత్యపుచిప్ప పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు, బటన్ పుట్టగొడుగులు ప్రధానమైనవి. మన రైతాంగం ఎక్కువ అధిక మార్కెట్ డిమాండు వున్న పాల పుట్టగొడుగుల పెంపకానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

సంవత్సరం పొడవునా వీటి దిగుబడి తీసే విధంగా రైతులు తగిన సాగు ప్రణాళికతో ముదండుగు వేయాలి. సాధారణంగా 10 / 10 చదరపు అడుగుల గది విస్తీర్ణంల 250 నుంచి 300 బెడ్లు పెంచుకోవచ్చు. బెడ్ల అమరికకు తగిన స్టాండ్ లు ఏర్పాటుచేసుకోవాలి. పాల పుట్టగొడుగుల బెడ్లను మొదటి 20 రోజులు చీకటీ గదిలో పెంచాల్సి వుంటుంది. అందువల్ల ప్రతి రెండు వెలుతురు గదులకు, ఒక చీకటి గది ఏర్పాటుచేసుకుంటే సంవత్సరం పొడవునా దిగుబడి తీయవచ్చు. తక్కువ పెట్టుబడితో, అతి తక్కువ స్థలంలో మంచి ఉపాధినిస్తుందని, పాల పుట్టగొడుగుల పెంపకం గురించి తెలియజేస్తున్నారు… హైదరాబాద్ లోని , రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల, పుట్టగొడుగుల పెంపక విభాగం, సీనియర్ శాస్త్రవేత్త డా. ప్రమీల.

ఈ విధంగా తయారుచేసిన బెడ్లను చీకటి గదిలో 20 నుంచి 25 రోజులపాటు పెంచాల్సి వుంటుంది. చీకటిగదిలో తగిన తేమశాతం ఉష్ణోగ్రత వుండేటట్లు జాగ్రత్త వహించాలి. బెడ్లలో మైసీలియం అభివృద్ధి చెందిన తర్వాత, పెద్ద బెడ్లు అయితే మధ్యకు కోసి, మట్టితో కేసింగ్ చేయాలి. కేసింగ్ చేసిన తర్వాత పాల పుట్టగొడుగులను వెలుతురు గదిలో వుంచాలి. గదిని ఫార్మాల్డిహైడ్ కలిపిన నీటితో  శుభ్రంగా కడిగి క్రిమిరహితం చేయాలి. గది ఉష్ణోగ్రత 30 – 35 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 80 నుండి 90 శాతం వుండాలి.  బెడ్లు తడీపొడిగా వుండేటట్లు నీటిని పిచికారీచేయాలి. నీరు బెడ్లపై కారేవిధంగా పిచికారీచేయకూడదు.

పాల పుట్టగొడుగుల పెంపక కాలం 60 రోజులు. 35 రోజుల దాటిన తర్వాత దిగుబడి ప్రారంభమవుతుంది. 3 నుంచి 4 దఫాలుగా గొడుగులను, బెడ్లనుంచి మెలితిప్పి కోయాల్సి వుంటుంది. సాధారణంగా కిలో పుట్టగొడుగుల విత్తనం  5 నుంచి 6 బెడ్లకు సరిపోతుంది. మరి ఆదాయ వ్యయాలు ఏవిధంగా వుంటాయో చూద్దాం. ఈ కుటీర పరిశ్రమలో నిత్యం దిగుబడి పొందాలంటే ప్రతీ రోజు కొత్తబెడ్లలో విత్తనాన్ని నింపుతూ పెంపకం చేయాలి. నెలకు కనీసంగా 200 బెడ్లనుంచి పుట్టగొడుగుల తీస్తే, ఖర్చులు పోనూ  20 వేలకు పైగా నికర లాభం సాధించవచ్చు. ఆదాయాన్ని మరింత పెంచుకోవటం ఎలా అనేది మనం అనుసరించే సాగు ప్రణాళికనుబట్టి వుంటుంది. చిన్నచిన్న గదుల్లో వీటిని పెంచే వీలుంది కనుక భారీ పెట్టుబడుల అవసరం వుండదు. ఆలస్యమెందుకు మీరూ తగిన ప్రణాళికతో ముందడుగు వేయండి మరి.

Read Also : Nursery Cultivation : ప్రో ట్రేలలో నారు పెంపకంతో ఉపయోగాలు.. సమయం, డబ్బు ఆదా