Mirchi Cultivation : ఈ సూచనలు పాటిస్తే పచ్చిమిర్చి సాగులో అధిక లాభాలు

Mirchi Cultivation : ప్రతి ఇంట భోజన విస్తరిలో ప్రధాన వంటకాల్లో మిరప కారం వినియోగించడం అనాదిగా వస్తున్న సంగతి విదితమే. కేవలం కారం గుణం కలిగిఉండటమేకాకుండా వంటకాలకు తినుబండారాలకు ఎరుపుదనాన్ని తెస్తుంది.

Mirchi Cultivation : ఏడాది పొడవునా సాగులో వుండే కూరగాయ పంట పచ్చిమిరప. వాణిజ్య సరళిలో ఎండుమిరపను ఖరీఫ్, రబీకాలాల్లో నాటితే, పచ్చిమిరపను అన్నికాలాల్లోను సాగుచేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటువల్ల రైతులు ఎకరాకు 10 నుండి 18 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. అయితే ఖరీఫ్ లో మిరప సాగుచేసే రైతులు.. అధిక దిగుబడి పొందాలంటే  ఎలాంటి సమగ్ర యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం..

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

ప్రపంచంలోనే అత్యధికంగా మిరప పండించే దేశంగా భారత్‌ పేరుగాంచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో 9 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో మిరపసాగవుతుంది. ఇది సుగంధ ద్రవ్యాల పంటగా ప్రసిద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌కలిగి ఉండడంతో రైతులు నిరంతరాయంగా ఈ పంటను పండిస్తున్నారు. ప్రతి ఇంట భోజన విస్తరిలో ప్రధాన వంటకాల్లో మిరప కారం వినియోగించడం అనాదిగా వస్తున్న సంగతి విదితమే. కేవలం కారం గుణం కలిగిఉండటమేకాకుండా వంటకాలకు తినుబండారాలకు ఎరుపుదనాన్ని తెస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ తో  దేశానికి విలువైన విదేశీమారక ద్రవ్యాన్ని సంపాదించిపెడుతోంది.  ఈ పంటను పండించేటప్పుడు విత్తనం ఎంపికతో పాటు నారు పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  పైరు ఎదుగుదల సమయంలో వచ్చే చీడపీడలను ఎప్పటికప్పుడు గుర్తించి నివారించాలి. అంతే కాకుండా సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులను తీసుకోవచ్చి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త వేణుగోపాల్.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ట్రెండింగ్ వార్తలు