Mulching System : మల్చింగ్‌ సాగు.. లాభాలు బాగు

నేలలోని సారాన్ని కాపాడటంలో ఈ మల్చింగ్‌ ప్రధాన పాత్ర వహిస్తుంది. పంటలు సాగు చేయని కాలంలో సారవంతమైన మట్టిని కప్పి ఉంచుతుంది. మొక్కల మధ్య మల్చింగ్‌ పదార్ధాలు ఉండడం వలన కలుపును బాగా నియంత్రిస్తుంది. దీని వలన పోషకాలన్నీ పంట తీసుకొనేందుకు వీలుంటుంది.

Mulching System

Mulching System : పంటలపై వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపిస్తున్నాయి. దీనికితోడు దిగుబడులు రాక పెట్టుబడులు చేతికందక తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందేవిధానలవైపు అడుగులు వేస్తున్నారు. నీటి వనరులు తక్కువ ఉన్నచోట పండ్ల తోటలు, కూరగాయాలు సాగు చేస్తూ లాభపడుతున్నారు.

READ ALSO : varieties of Warangal Kandi : రైతులకు అందుబాటులో నూతన వరంగల్ కంది రకాలు.. తక్కువ సమయంలోనే అధిక దిగుబడి

అయితే వీటిని సాగు చేసే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఒకటైన ప్లాస్టిక్‌ మల్చింగ్‌ విధానం ద్వారా నేలలోని తేమను కాపాడుకోవడంపాటు నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ విధానం రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

READ ALSO : Mulching Method : మల్చింగ్ విధానంతో.. మెట్టపంటలసాగు

వాయిస్ ఓవర్ : పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మొక్కలకు సరైన నీటి తడులు అందక వడలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్ధవంతంగా ఉపయోగించి పంటలను సాగు చేసేందుకు మల్చింగ్‌ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. దీని వలన తేమ ఆవిరైపోకుండా మొక్క చుట్టూ ఎక్కువ కాలం ఉంటుంది. ఉష్ణోగ్రత వ్యత్యాసాల వలన నేల భౌతిక స్థితి దెబ్బతినకుండా ఉంటుంది.

READ ALSO : Mahua Flower : గిరిజనులకు కల్పతరువుగా ఇప్పపువ్వు.. ఉప ఉత్పత్తులతో ఉపాధి పొందుతున్న మహిళలు

నేలలోని సారాన్ని కాపాడటంలో ఈ మల్చింగ్‌ ప్రధాన పాత్ర వహిస్తుంది. పంటలు సాగు చేయని కాలంలో సారవంతమైన మట్టిని కప్పి ఉంచుతుంది. మొక్కల మధ్య మల్చింగ్‌ పదార్ధాలు ఉండడం వలన కలుపును బాగా నియంత్రిస్తుంది. దీని వలన పోషకాలన్నీ పంట తీసుకొనేందుకు వీలుంటుంది. నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. నేలలో పోషకాల స్థాయి కూడా సహజసిద్ధంగా పెరుగుతుంది.

READ ALSO : Mulching Sheet : తక్కువ ఖర్చుతో మల్చింగ్ షీట్ పరుపు…ఎలాగంటే…

ఈ మల్చింగ్‌ విధానాన్ని దీర్ఘకాలంగా చేస్తే పంటల్లో గణనీయమైన పెరుగుదలతో పాటు చీడపీడలను సమర్ధవంతంగా తట్టుకొనే శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా పంటల ఉత్పాదనలో కూడా మెరుగుదల కన్పిస్తుందని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్ .

ట్రెండింగ్ వార్తలు