National Farmer's Day : Kisan Diwas Know its history and significance
National Farmer’s Day : దేశానికి రైతు వెన్నుముక. ఈరోజున కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు చలువే. అలాంటి రైతు పగలు ,రాత్రి శ్రమించి పంట పండించినా అది చేతికి అందుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం కుంగిపోకుండా ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాది ప్రకృతి కరుణించకపోతుందా, పంట చేతికందక పోతుందా అనే ఒక చిన్న ఆశతో జీవనం సాగిస్తున్నారు. అందుకే ఆ రైతు కోసం ప్రతి ఏటా డిసెంబర్ 23 వ తేదీని దేశవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని జరుపుకుంటాం.
రైతు లేనిదే ఈరోజు మనిషి లేడు.. రైతు అహర్నిశలు కష్టపడితే తప్ప మన కంచంలోకి అన్నం రాదు.. ఈరోజు దేశమంతా ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం తింటుంది అంటే అది రైతు వల్లే. అలాంటి రైతు ఆరు నెలలు కష్టపడినా, శ్రమ అంతా చేతికి దక్కుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం అటు ప్రకృతి మీద, ఇటు ప్రభుత్వం మీద భారం వేసి జీవనం సాగిస్తున్నారు.
ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి తెస్తున్నాయి. అందుకే దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో రైతులు పోషిస్తున్న పాత్ర గురించి ప్రజలందరికీ తెలియచెప్పటం కోసం ప్రతిఏటా డిసెంబర్ 23 న జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటాం.
రైతులకు వ్యవసాయంపై అవగాహన పెంచటం, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త విధానాలను తెలియచెప్పటం, తక్కువ పెట్టుబడులతో అధిక ఉత్పత్తిని సాధించేందుకు రూపొందించిన వైజ్ఞానిక వ్యవసాయం గురించి ప్రచారం చేయటం కూడా జాతీయ రైతు దినోత్సవం లక్ష్యం. అందుకే పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతు సదస్సు నిర్వహించారు. వ్యవసాయంలో నూతన శాస్త్రీయ పద్ధతుల పట్ల అవగాహన కల్పించారు.
ప్రస్తుత పరిస్థిలలో వర్షాల కోసం, విత్తనాలు , ఎరువుల కోసం.. బ్యాంకు రుణాల కోసం ఇలా ప్రతి విషయంలోనూ ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతోంది. ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి. ఒకవేళ ప్రకృతి కరుణించి దిగుబడి బాగున్నా పండిన పంటకు సరైన ధరలేక నిస్సాహయుడిగా మిగిలిపోయే పరిస్థితి.