Organic Farming Tips : పామాయిల్ తోటలో సొర, బీర, కాకర సాగు

Organic Farming Tips : భూమిని నమ్ముకొని కష్టపడి పంటలు పండించడమే రైతులకు నిన్నటి వరకు తెలుసు. కానీ ఇటీవల అంతర పంటల సాగుతో వినూత్న రీతిలో దిగుబడులు తీస్తూ.. నాలుగు రూపాయలను వెనకేసుకుంటున్నారు.

Organic Farming Tips

Organic Farming Tips : రైతుకు అదనపు ఆదాయాన్ని అందిస్తూ.. ఆర్థిక భరోసాను అందిస్తాయి అంతర పంటలు. ఒకే పంటపై ఆధారపడితే అంతగా ఆదాయం రాదు. ముఖ్యంగా పామాయిల్ లాంటి పంటలైతే  ఫలసాయం పొందాలంటే నాలుగైదేళ్ళు పాటు ఆగాల్సి వస్తుంది.

Read Also : Vegetable Cultivation : ఊరంతా.. కూరగాయల సాగు..

అందుకే చాలా మంది తక్కువ సమయంలో చేతికొచ్చే కూరగాయ పంటలను అంతర పంటలుగా సాగుచేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు పామాయిల్  తోటలో తీగజాతి  కూరగాయలను అంతర పంటలుగా సాగుచేస్తూ.. మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు.

భూమిని నమ్ముకొని కష్టపడి పంటలు పండించడమే రైతులకు నిన్నటి వరకు తెలుసు. కానీ ఇటీవల అంతర పంటల సాగుతో వినూత్న రీతిలో దిగుబడులు తీస్తూ.. నాలుగు రూపాయలను వెనకేసుకుంటున్నారు. అంతర పంటల సాగంటే ఈ రైతే చేయాలనే రీతిలో ముందుకు సాగుతున్నారు నెల్లూరు జిల్లా,  చింతలపూడి మండలం, ప్రగడవరం గ్రామానికి చెందిన రైతు కొనకళ్ళ చెన్నారావు.

ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లో అధికంగా కొబ్బరి తోపాటు పామాయిల్ సాగు చేస్తుంటాయి రైతులు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఈ తోటల సాగుకు కొబ్బరిసాగుకు అత్యంత అనువుగా వుంటాయి. అందుకే ప్రతి రైతు కొబ్బరి లేదా పామాయిల్ తోటలు సాగుచేస్తుంటారు.

అయితే సాగులో పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా ఉండటంతో,  ఏకపంటగా కొబ్బరి, పామాయిల్ సాగు రైతులకు గిట్టుబాటు కావటం లేదు. ఈ దశలో చాలా మంది అంతర పంటలు సాగుచేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కోవలోనే నెల్లూరు జిల్లా, చింతలపూడి మండలం, ప్రగడవరం గ్రామానికి చెందిన రైతు కొనకళ్ళ చెన్నారావు తనకున్న 5 ఎకరాల పామాయిల్ తోటలో స్థానికంగా దొరికే కర్రలతో పందిర్లను వేసి అంతర పంటలుగా తీగజాతి కూరగాయ పంటలైన బీర, కాకర, సొర పండిస్తున్నారు.

వాణిజ్య పంటలకు ఏడాది పొడవునా పెట్టుబడి పెట్టాల్సి ఉండగా, అంతర పంటలకు స్వల్పంగా పెట్టుబడి పెడితే నిత్యం అధికంగా ఆదాయం లభిస్తోంది. దీనిని వాణిజ్య పంటలకు వినయోగించడంతో ఆర్థిక భారాన్ని తగ్గిచుకోవచ్చు. అంతే కాదు అంతర పంటలతో కలుపును నివారించుకునే అవకాశం ఉంది. ప్రధాన పంటకు నుండి దిగుబడి పొందాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే అంతర పంటలతో అదనపు ఆదాయం పొందుతున్న ఈ అభ్యుదయ రైతు.

Read Also : Vegetable Cultivation : ఊరంతా.. కూరగాయల సాగు..

ట్రెండింగ్ వార్తలు