Paddy Cultivation : మేలైన వరి నారు కోసం వరినారుమడుల పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్యం

నారు మళ్లు పోసే రైతాంగం అంటే దమ్ముచేసి మండెకట్టిన విత్తనాన్ని మడిలో చల్లే రైతాంగం విత్తన శుద్ధి చేసేటప్పుడు 25లీటర్ల నీటిలో 25గ్రాముల కార్బండిజం చొప్పున కలిపి 25 కిలోల విత్తనాన్ని ఈ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మండెకట్టుకోవాలి. ఎత్తుమళ్లలో విత్తనం పోసిన తర్వాత నీరు నిల్వ వుండకుండా చూసుకోవాలి .

Paddy Nursery Preparation

Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో వరినారుమళ్లు పోసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి . నేరుగా వరి విత్తే విధానాలు చాలా ప్రాంతాల్లో ఆచరణలో వున్నా…. చాలామంది రైతులు నారుమళ్ల ను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు.. సాగునీటి లభ్యత తక్కువ వున్న రైతులు పొడి దుక్కిలో విత్తనం వెదజల్లుతుండగా, నీటి సౌలభ్యం వున్న రైతులు దమ్ముచేసి నారు మళ్లు పోస్తున్నారు . మరి ఆరోగ్యవంతమైన నారు అందిరావాలంటే , యాజమాన్యంలో ఎటువంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Weed Control : వరి నారుమడితోపాటు, నాట్లు వేసిన తరువాత కలుపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు!

నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు, వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల పెంపకం చేపడుతుండగా, అధికశాతం మంది రైతులు దంప నారుమళ్లు పోస్తున్నారు . మరి నారు పుష్ఠిగా పెరిగి, 25 నుండి 30 రోజుల్లో అందిరావాలంటే , విత్తనశుద్ది, పోషక యాజమాన్యం, కలుపు నివారణ, చీడపీడలకు అడ్డుకట్టవేయటం తప్పనిసరి అని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. డి. చిన్నమ నాయుడు .

READ ALSO : Preparation of Paddy Nursery : ఖరీఫ్ వరినారుమడులు పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారుకోసం శాస్త్రవేత్తల సూచనలు

దంపనారు మళ్లు పోసే రైతాంగం అంటే దమ్ముచేసి మండెకట్టిన విత్తనాన్ని మడిలో చల్లే రైతాంగం విత్తన శుద్ధి చేసేటప్పుడు 25లీటర్ల నీటిలో 25గ్రాముల కార్బండిజం చొప్పున కలిపి 25 కిలోల విత్తనాన్ని ఈ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మండెకట్టుకోవాలి. ఎత్తుమళ్లలో విత్తనం పోసిన తర్వాత నీరు నిల్వ వుండకుండా చూసుకోవాలి . నీరు నిల్వ వుంటే విత్తనం మురిగిపోతుంది . మడుల మధ్య కాలువలు ఏర్పాటుచేసుకుంటే నీరు నిల్వ వుండదు. ఏ కారణం చేతైనా పోషకాలను సకాలంలో అందించని రైతాంగం, పిచికారీ రూపంలో అందిస్తే మంచిదని సూచిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త .