Paddy Cultivation : వరినారుమళ్లపై శీతల గాలుల ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

Paddy Cultivation : అన్నదాతలు ఈ యాసంగికి స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కావడం , చలితీవ్రత పెరుగుండటంతో వరి నారు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంది.

Paddy Cultivation

Paddy Cultivation : నీటివసతి కింద, రబీ వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే  విత్తన ఎంపికతో పాటు మేలైన నారుమళ్ల యాజమాన్యం చేపట్టాలి. అసలే చలికాలం కావడంతో వరి నారుమళ్లలో ఎదుగుదల అంతగా ఉండదు. నాణ్యమైన నారుకోసం చేపట్టాల్సిన మెళకువలను కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం. శాస్త్రవేత్త విజయ్ ద్వారా తెలుసుకుందాం..

ఖరీఫ్ లో సాగుచేసిన వరి పంటలు చాలా చోట్ల చేతికొచ్చాయి.  మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే కోస్తున్నారు. ప్రస్తుతం రెండవ పంటగా, వరిసాగు కోసం , వ్యవసాయ పనులను చేసేందుకు సిద్ధమవుతన్నారు . నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో  ఆరుతడి పంటలను సాగును ఎంచుకుంటున్నా..  నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వరిని సాగుచేసుకునేందుకు సంసిద్ధమవుతున్నారు రైతులు.

అయితే అన్నదాతలు ఈ యాసంగికి స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతే కాదు ప్రస్తుతం శీతాకాలం కావడం , చలితీవ్రత పెరుగుండటంతో వరి నారు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నారుమడులలో మేలైన యాజమాన్యం చేపట్టినట్లైతే నాణ్యమైన నారు పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు  జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం. శాస్త్రవేత్త విజయ్.

విత్తన మోతాదు :

దొడ్డు రకాలు ఎకరాకు 20 కి.
సన్నరకాలు ఎకరాకు 25 కి.

విత్తన శుధ్ది :
1 కి. విత్తనానికి కార్భెండిజమ్ 1 గ్రా.

నిద్రావస్థ తొలగించడం
1 కి. విత్తనానికి గాఢ నత్రికామ్లం 6.3 మి. లీ

ఎరువుల యాజమాన్యం : 

నత్రజని 2 కి. భాస్వరం 2 కి. పొటాష్ 1 కి.

యూరియాను  రెండు దఫాలుగా వేసుకోవాలి

చివరి దుక్కిలో సగం, 10 -15 రో. సమయంలో సగం

ఆఖరి దుక్కిలో మొత్తం భాస్వరం ఎరువులు వేయాలి

1.3 లేదా 1.7 పొటాషియం ఎరువులు

ట్రెండింగ్ వార్తలు