Paddy Crop
Paddy Crop : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి దుబ్బుచేసే దశ నుండి ఈనే దశ వరకు ఉంది. ఈ దశలో సుడిదోమ, మొగిపురుగు ఆశించి నష్టం చేసే అవకాశం ఉంది. వీటిని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, శ్రవణ్ కుమార్.
ఖరీఫ్‌లో రైతులు అధికంగా వరి సాగు చేపట్టారు రైతులు. తెలంగాణలో దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఈ పంట వివిధ ప్రాంతాలలో పిలక దశ నుండి ఈనే దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు, ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా చోట్ల చీడపీడలు ఆశించించే అవకాశం ఉంది. ముఖ్యంగా కాండంతొలిచే పురుగు, సుడిదోమ చాలా చోట్ల ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ముఖ్యంగా వరిసాగయ్యే అన్ని ప్రాంతాల్లో గోదుమ రంగు దోమ, తెల్లదోమలు ఆశిస్తాయి. ఇవి ఆశించిన పొలాలు సుడులు, సుడులుగా వలయాకారంలో ఎండిపోతూ ఉంటాయి. వీటి ఉదృతి అధికమైతే పొలం ఎండిపోయి గింజలు తాలుగా ఏర్పడుతాయి. వీటి గుర్తించిన వెంటనే నివారణకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రావణ్ కుమార్.
ప్రస్తుత పరిస్థితుల్లో వరికి ఆశించే మరో పురుగు మొగిపురుగు. ఇది పిలక దశ నుండి చిరుపొట్ట దశ వరకు ఆశించి తీవ్ర నష్టం చేస్తుంటుంది. ఇది రబీ సీజన్ లో ఆశించి అధిక నష్టం చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఖరీఫ్ లో కూడా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు చూద్దాం.