Cattle health
Cattle Health : పశు సంపద మానవులకు ఎన్నో విధాలుగా మేలు చేస్తూ లాభాలనిస్తోంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. కాలం, వాతావరణాన్ని బట్టి మానవుల మాదిరిగానే పశువుల్లోనూ అనేక వ్యాధులు వస్తుంటాయి. సీజనల్ వ్యాధులపై జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా పరాన్నజీవుల బారి నుంచి వాటిని కాపాడుకోవాలి. పశువులకు ఆశించే పరాన్నజీవులు వాటి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో తెలియజేస్తున్నారు గన్నవరం పశువైద్యకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పవన్ కుమార్.
READ ALSO : Seasoned Salt : వంటకాలలో రుచికోసం ఉపయోగించే ఉప్పు తో ఆరోగ్యానికి ముప్పు !
వ్యవసాయ అనుబంధ రంగంగా పాడి పరిశ్రమ వాణిజ్య స్థాయిలో విస్తరించింది. రైతులు పదుల సంఖ్య నుండి వందల సంఖ్యలో పశువులను పెంచుతూ.. ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు. చాలా వరకు ఈ పరిశ్రమ ద్వారా ఎంతో మంది రైతులు ఉపాధి పొందుతున్నారు. అయితే కొంత మంది రైతులకు పాడిపశువులకు ఆశించే వ్యాధుల పట్ల అవగాహన లేకపోవడంతో తీవ్రంగా నష్టాలను చవిచూస్తున్నారు.
ఇందులో ముఖ్యమైనది పాడి పశువుల పాలనలో షెడ్డును పరిశుభ్రంగా ఉంచుకోవడం అతి ముఖ్యమైంది. పశువుకు ఎంత మేత , ఎన్ని ఖనిజ లవణాలిచ్చినా ఆశించిన పాల దిగుబడి రాదు. దీనికి ప్రధాన కారణం పశువులను పీడించే పరాన్నజీవులు. ఇవి సోకడానికి ముఖ్య కారణం గోమార్లు, పిడుదులు , ఈగలు, దోమలు. ఇవి పాడిపశువులను పీడించి రక్తం పీల్చడంతో పాటు పాకను ఆక్రమించి కుట్టి బాధిస్తుంటాయి. షెడ్డు చుట్టూ పరిసరాలు చిత్తడిగా మారితే దోమలు , ఈగలు పశువులను ఎక్కువగా బాధిస్తాయి. దీంతో రక్త పరాన్నజీవుల ఆశించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. అందుకే పశువుల పాకను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ పరాన్న జీవుల బెడదను అరికట్టవచ్చని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, గన్నవరం పశువైద్యకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పవన్ కుమార్.
READ ALSO : Mixed Farming : మిశ్రమ వ్యవసాయంతోనే లాభాలు
ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో సంకరజాతి పశువులకు బాహ్యపరాన్న జీవులైన థైలీరియాసిస్ , బిబిషియాసిస్ వ్యాధులు ఆశిస్తాయి. పేలు, పిడుదులు, గోమార్ల ద్వారా ఆశించే ఈ వ్యాధులను పశుపుశూద్యుల సలహాపూ ప్రత్యేకంగా టీకాలు వేయించాలి.
రైతులు తెలిసీ తెలియక, అవసరమున్నా లేకున్నా, విచక్షణారహితంగా మూగజీవాలకు మందులు, ఇంజెక్షన్లు వాడడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి పశువైద్యుని ద్వారా వ్యాధి నిర్ధారణ చేయించిన తర్వాతే అవసరమైన మందుల్ని వాడి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, త్వరగా చికిత్స చేయిస్తే పశువుల్ని మరణాల నుండి రక్షించుకునే అవకాశం అధికంగా ఉంటుంది.