Pattu Purugu Pempakam : పట్టుపురుగుల పెంపకంతో అధిక లాభాలు

సాధారణంగా పట్టుపురుగుల పెంపకం కాలం 25 రోజులు. దీనిలో గుడ్డునుంచి పిల్ల బయటకు వచ్చాక 18 రోజులు లార్వాదశలో వుంటుంది. ఆతర్వాత గూడుకట్టే దశలో మరో 5 నుంచి 6 రోజులు వుంటుంది. లార్వాదశలో 4 జ్వరాలు ఉంటాయి. వీటిన మోల్టింగ్ దశ అంటారు.

Pattu Purugu Pempakam

Pattu Purugu Pempakam : ప్రతి నెలా ఆదాయం అందించే పట్టు పురుగుల పెంపకంపై రైతులు దృష్టి సారిస్తున్నారు. సంప్రదాయ పంటలతో ఏటా నష్టపోతున్న అన్నదాతలకు.. పట్టు పరిశ్రమ వరంగా మారింది. నిత్యం శ్రమ చేసే చిన్న, సన్నకారు రైతులకు ఈ పరిశ్రమ మరింత అనుకూలంగా వుంది.  పట్టుపురుగుల పెంపకంలో తక్కువ పెట్టుబడితో, ఏడాదంతా పంటలను తీసుకునే వెసులు బాటు ఉండటంతో రైతులు వీటిపెంపకం వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా కు చెందిన కొందరు రైతులు పట్టుపురుగుల పెంపకంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

READ ALSO : Vegetable Seeds Cultivation : రైతు స్థాయిలో కూరగాయల విత్తనోత్పత్తిలో మెళకువలు

చిన్న సన్నకారు రైతులు, నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధిని అందించే పరిశ్రమగా విరాజిల్లుతోంది పట్టు పరిశ్రమ. పట్టు దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం రైతాంగానికి, పట్టు శాఖ ద్వారా అనేక ప్రోత్సహకాలు, రాయితీలు అందిస్తోంది.  మల్బరీ తోటల పెంపకం నుంచి షెడ్డు నిర్మాణం వరకు, పట్టు పురుగుల పెంపకం దశనుంచి మార్కెటింగ్ వరకు ఈ రాయితీలు అడుగడుగునా రైతుకు లభిస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని  అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు  కృష్ణా జిల్లా , నూజివీడు మండలం , పోలసాని పల్లి గ్రామానికి చెందిన రైతులు.

సాధారణంగా పట్టుపురుగుల పెంపకం కాలం 25 రోజులు. దీనిలో గుడ్డునుంచి పిల్ల బయటకు వచ్చాక 18 రోజులు లార్వాదశలో వుంటుంది. ఆతర్వాత గూడుకట్టే దశలో మరో 5 నుంచి 6 రోజులు వుంటుంది. లార్వాదశలో 4 జ్వరాలు ఉంటాయి. వీటినే మోల్టింగ్ దశ అంటారు. అయితే గుడ్డునుంచి పిల్ల బయటకు వచ్చే దశలో మొదటి 7రోజుల్లో ఉండే రెండు జ్వరాలు అతి కీలకమైనవి. దీన్ని చాకీ దశ అంటారు.

READ ALSO : Seed Quality : విత్తనం నాణ్యత, జన్యు స్వచ్చతపైన పంట దిగుబడులు.. రైతు స్థాయిలో విత్తనోత్పత్తికి సూచనలు

ఈ దశలో పురుగుల మరణాల శాతం అధికంగా వుంటుంది. ఇప్పుడు చాకీ దశను పట్టుశాఖ నియంత్రణలో పూర్తిచేసి, రైతులకు అందిస్తున్నారు. దీనివల్ల రైతులకు రిస్కు తగ్గటంతోపాటు 7రోజుల పంటకాలం కూడా తగ్గుతోంది. అంటే 18 నుంచి 20 రోజుల్లో పంట చేతికి వస్తుంది . అయితే ఇక్కడి రైతులు మాత్రం చాకీ దశను కూడా సొంతంగా చేసుకుంటున్నారు. ఎకరాకు విడుతల వారిగా 250 గుడ్లను పెంచితే నెలకు 70 వేల నుండి లక్ష రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు.

వాణిజ్య పంటలకు పెట్టుబడులు పెరిగిపోవడం, అందుకు అనుగుణంగా మార్కెట్లో ధర రాని పరిస్థితుల్లో… రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పసుపు, వరి, చెరుకు , పత్తి లాంటి పంటలను సాగుచేసి ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతన్నలు, లాభాలు అందించే పట్టు పురుగుల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటు ప్రభుత్వం కూడా ప్రోత్సహకాలు ఇస్తుండటంతో.. రైతులు మంచి లాభాలు పొందుతున్నారు.

READ ALSO : Cattle Reproduction : పశువుల పునరుత్పత్తిలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు

ఇతర పంటలతో పోలిస్తే పట్టు పురుగల పెంపకం తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తోంది. ఎకరాకు రూ.3 నుండి 4 లక్షల వరకు నికర ఆదాయం చేకూరుతోంది. రైతులు మల్బరీ సాగులో తగిన మెళకువలు పాటించి, పట్టు పురుగుల పెంపకం పట్ల తగిన అవగాహనతో ముందడుగు వేస్తే  స్వయం ఉపాధికి డోకా ఉండదనేది, క్షేత్రస్థాయిలో రైతుల అనుభవాల ద్వారా నిరూపితమవుతోంది. నిరంతరం వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు, ఈ తోటలను కూడా సేద్యంలో భాగం చేసుకుంటే అధిక ఆదాయం పొందేందుకు ఆస్కారం ఉంది.