pest control In besan Cultivation
Besan Cultivation : మంచును తేమగా ఉపయోగించుకుని శీతాకాలంలో అధిక దిగుబడినిచ్చే పప్పుధాన్యం శనగ. ఉమ్మడి రాష్ట్రాల్లో రబీ పంటగా శనగ సాగు దాదాపు 6 లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. చల్లని వాతావరణంలో మంచి పెరుగుదలను కనబరిచే ఈ పంట, ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. ఈ పంటకు చాలా చోట్ల పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు చూద్దాం..
రబీకాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. వాణిజ్యపంటలైన మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ.. రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నీటి వసతి తక్కువ వుండే నల్లరేగడి భూముల్లో రబీపంటగా మంచును ఉపయోగించుకుని పెరగ గల పంట ఇది. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ లో 4 నుండి 5 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా, తెలంగాణలో మాత్రం 1 లక్షా 20 వేల హెక్టార్లలోనే సాగవుతుంది.
అయితే, ఈ సారి వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుచేయాలని, ప్రభుత్వం చెప్పడంతో , సాగువిస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం పూత దశ నుండి శాఖీయ దశ వరకు ఉంది. అయితే ఈ సమయంలో పురుగుల ఉధృతి కూడా పెరిగింది. వీటిని సకాలంలో నివారించకపోతే , పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్.
Read Also : Sustainable Agriculture : స్టార్టప్‌లతోనే సుస్థిర వ్యవసాయం