Pest control in Chilli Farming
Chilli Farming : తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా రైతులు మిరపను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. ఎర్ర బంగారంగా పేరుగాంచిన ఈ పంటకు ఎగుమతి అవకాశాలు పుష్కలం. అయితే పంట ప్రారంభం నుంచి రసంపీల్చు పురుగుల పట్టి పీడిస్తుండటంతో ఆకుముడత ఏర్పడి, పైరు గిడసబారి రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు.
మరోవైపు వైరస్ తెగుళ్లు సోకి తోటల్లో దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వాతావరణ ప్రతికూలత, యాజమాన్య లోపాలు వీటి వ్యాప్తికి దోహద పడుతున్నాయి. వీటిని నిరోధించేందుకు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, వేణుగోపాల్.
Read Also : Milk Production : శీతాకాలంలో పశువుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. పాల దిగుబడి తగ్గే ప్రమాదం..!
వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మిరప పంటను మించినది మరొకటి లేదు. గత ఏడాది మిరప సాగులో రైతులు మంచి ఫలితాలు సాధించారు. కానీ ఈ ఏడాది బెట్టపరిస్థితులు.. , వాతావరణ ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గుల వల్ల సాగు ప్రారంభం నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం వేసిన పంటలో పురుగులు, తెగుళ్ల సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మిరప తోటలకు రసం పీల్చు పురుగుల బెడద ప్రధాన సమస్యగా మారింది.
వీటి వల్ల మొక్కల్లో ముడత తెగుళ్ల ఉధృతి పెరిగి తోటంతా గిడసబారిపోవటం, పూత, పిందె రాలిపోయి దిగుబడి తగ్గిపోవటం జరుగుతోంది. వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేసే ఈ రసంపీల్చు పురుగుల వల్ల మిరపకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మిరప తోటలకు ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణ ఏ విధంగా చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త వేణుగోపాల్.