Cotton Crop : పత్తి పంటలో పెరిగిన తెగుళ్ల ఉదృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

Cotton Crop : ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉంది. విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాలలో తెగుళ్ల ఉధృతి పెరిగింది.

Pest Control In Cotton Crop

Cotton Crop : ఈ ఖరీఫ్ లో వేసిన పత్తి పైరు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో వుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉదృతి పెరిగింది. ముఖ్యంగా  తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వీటి  నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ  చర్యల గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం.

ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉంది. ముందుగా విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాలలో తెగుళ్ల ఉధృతి పెరిగింది. చాలాచోట్ల కాయకుళ్ళు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాయదశలో ఉన్నప్పుడు వర్షాలు పడితే అనేక రకాల శిలీంధ్రాలు ఆశించి కాయలు కుళ్లిపోతాయి.

పురుగుల వల్ల ఏర్పడిన రంధ్రాల ద్వారా శిలీంద్రాలు కాయలోకి ప్రవేశించిన తెగులును కలుగజేస్తున్నాయి. మరో వైపు ప్రస్తుతం అక్కడక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా పత్తిలో పోషకాల లోపం ఏర్పడి వడలి పోతున్నాయి. మరోవైపు ఆకుమచ్చతెగులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు జిత్యాల జిల్లా,  పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం.

Read Also : Dragon Fruit Cultivation : ప్రకృతి విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు.. పంట మార్చాడు.. లాభాలు ఆర్జిస్తున్నాడు