Moong Dal Crop : పెసరలో ఎర్రగొంగళి పురుగుల బెడద.. నివారణకు చేపట్టాల్సిన చర్యలు

Moong Dal Crop : పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద మూడు కాలాల్లోను సాగుచేస్తున్నారు రైతులు . ప్రస్తుతం ఖరీఫ్ లో వర్షాలు ఆలస్యం కావడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు పెసరను సాగుచేశారు.

Pest Control In Moong Dal

Moong Dal Crop : ఖరీఫ్‌లో తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వటంతోపాటు  రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న పంట ఇది . ప్రస్తుతం వర్షాధారంగా వేసిన పంట 20 రోజుల నుండి పూత, పిందె గట్టి పడే దశలో ఉంది. అయితే అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగళి పురుగులు సమస్యగా మారాయి. వీటిని సరైన సమయంలో నివారిస్తే మంచి దిగుబడులను సాధించ వచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద మూడు కాలాల్లోను సాగుచేస్తున్నారు రైతులు . ప్రస్తుతం ఖరీఫ్ లో వర్షాలు ఆలస్యం కావడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు పెసరను సాగుచేశారు. ఇటు కందిలో, పత్తిలో అంతర పంటగా కూడా వేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో 20 రోజుల నుండి పూత, పిందె గట్టి పడే దశలో ఉంది.

అయితే, అడపాదడప కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగళి పురుగు సమస్యగా మారింది. ఈ పురుగులు ఒక పొలం నుండి ఇంకో పొలానికి తిరుగుతూ  ఆ ప్రాంతంలో తీవ్రంగా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర యాజమాన్యం చేపడితే మంచి డిగుబడులను పొందవచ్చంటున్నారు  ప్రధాన శాస్త్రవేత్త డా. జె.హేమంత్ కుమార్.

ముఖ్యంగా ఎర్రగొంగళి పురుగుల నివారణకు లైట్ ట్రాప్స్ పెట్టుకుంటే చాలావరకు అరికట్టవచ్చు. అలాగే పొలం చుట్టు కందకాలు తీయడమే కాకుండా జిల్లేడు చెట్లను పెట్టుకున్నట్లైతే ఆ పురుగులు జిల్లెడు ఆకర్షిస్తాయి. దీంతో ఈ పురుగుల బెడదనుండి పంటను కాపాడుకోవచ్చు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

ట్రెండింగ్ వార్తలు