Pest Control In Paddy
Paddy Pest Control : ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలోనే పలకరించాయి. అందుకు తగ్గట్టుగానే రైతులు వరిసాగును చేపట్టారు. ఇప్పటికే కొన్ని చోట్ల వరినారుమడులు పోయగా.. అనేక ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పోసుకుంటున్నారు. అయితే సన్నరకాలకు అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముందస్తు చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం వరిలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. ఎస్. మాలతి.
Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు
తెలంగాణలో చెరువుల కింద, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఈ పంటలను ఈ సారి అధికంగా సన్నగింజ రకాలనే సాగుచేసేందుకు రైతులు మొగ్గుచూపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దీర్ఘకాలిక రకాలను పోసుకున్న రైతులు ప్రధాన పొలాన్ని సిద్ధం చేస్తున్నారు. మధ్య , స్వల్పకాలిక రకాలను సాగుచేస్తున్న రైతులు మాత్రం నారుమడులు పోసుకుంటున్నారు.
అయితే సన్న గింజ రకాలకు అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉండటంతో తొలిదశలోనే వాటిని అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. వరిలో ఆశించే చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. ఎస్. మాలతి. గత రబీలో కాటిక తెగులు అధికంగా ఆశించిదిజ . ఈ ఖరీఫ్ లో వాటినుండి ముందస్తు చర్యలు చేపట్టి పంటను కాపాడుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు