Ragi Cultivation : రాగిలో ఎరువులు, చీడపీడల నివారణ.. సమగ్ర యాజమాన్య పద్ధతులు

Pest Control in Ragi Cultivation : ఎలాంటి వాతావరణంలోనైనా.. అతి తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలో పంట చేతికి అంది రావడంతో చాలా మంది రైతులు రాగిసాగువైపు ఆసక్తి చూపుతున్నారు.

Pest Control in Ragi Cultivation

Pest Control in Ragi Cultivation : ఒకప్పుడు చిన్నచూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పడు పూర్వ వైభవం వస్తోంది. చిరుధాన్యాల్లోని పోషక విలువలు, ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్ళీ వీటి వాడకం పెరిగింది. దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది.

Read Also : Pests in Chilli Cultivation : మిరప తోటల్లో పురుగులు, తెగుళ్ల ఉధృతి.. చీడపీడల నివారణ

చిరుధాన్యాలలో ఒకటైన రాగిని రబీ పంటగా నవంబరు నుంచి డిసెంబరు వరకు సాగుచేశారు. అయితే అధిక దిగుబడులు తీయాలంటే ఎరువులు, చీడపీడల యాజమాన్యం కీలకమని వాటి వివరాలు తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. కిరణ్ కుమార్.

రాగిలో సమగ్ర యాజమాన్యం : 
చిరుధాన్యాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట రాగి. తెలంగాణలో కొన్ని ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధికంగా సాగుచేస్తూ ఉంటారు. రాగుళ్లో ఉన్న పోషకవిలువల పట్ల ఇటీవల అవగాహన పెరగడంతో.. ఇటీవల ఈ పంటసాగు పుంజుకుంది. దీనికి తోడు ఎలాంటి వాతావరణంలోనైనా.. అతి తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలో పంట చేతికి అంది రావడంతో చాలా మంది రైతులు రాగిసాగువైపు ఆసక్తి చూపుతున్నారు.

రబీపంటగా రాగిని నవంబర్ నుండి డిసెంబర్ వరకు, వేసవి పంటగా జనవరి నుండి ఫిబ్రవరి వరకు విత్తుకుంటారు. ఇప్పటికే వేసిన రబీ పంట పెరుగుదల దశలో ఉండగా.. మరి కొన్ని ప్రాంతాల్లో ఇంకా వేస్తున్నారు. అయితే రబీ, వేసవి రాగి సాగులో అధిక దిగుబడులు  సాధించాలంటే సమగ్ర ఎరువుల యాజమాన్యం తో పాటు ఆశించే చీడపీడల నివారణ కుడా చేపట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. కిరణ్ కుమార్.

Read Also : Country Chicken Farming : స్వయం ఉపాధి కోసం నాటు కోళ్ల వ్యాపారం

ట్రెండింగ్ వార్తలు