Lemon Tree Cultivation
Lemon Tree Cultivation : నిమ్మసాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే నిమ్మరైతులను నిరంతరాయంగా వెన్నాడుతున్న సమస్య నల్లిపురుగులు, గజ్జితెగులు సమస్య. సమస్యాత్మక నేలల్లో నాటిన తోటల్లోను, యాజమాన్యం సరిగా లేని తోటల్లో వీటి తాకిడి అధికంగా కనిపిస్తోంది. ఇవి ఆశించిన చెట్టు క్షీణించటంతో పాటు కాయ నాణ్యత లోపించటం వల్ల రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ తెగులు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యలేంటో ఇప్పుడు చూద్దాం..
READ ALSO : Production of Natu Koramenu : నాటు కొరమేను పిల్లల ఉత్పత్తి.. అనుబంధంగా కోళ్లు, బాతుల పెంపకం
నాటిన 3వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు నిరంతరాయంగా దిగుబడినిచ్చే పంట నిమ్మ. ఈ తోటల నుంచి ఏడాది పొడవునా కాయదిగుబడి వచ్చినప్పటికీ నవంబరు నుంచి వచ్చే పూత నుంచి రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ పూత నుంచి వేసవిలో కాయ తయారవుతుంది. వేసవిలో నిమ్మకాయకు అధిక డిమాండు వుంటుంది కనుక, రైతుకు మంచి రేటు లభిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో నిమ్మతోటలను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. కృష్ణా గుంటూరు, గోదావరి జిల్లాలతోపాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని సారవంతమైన మెట్ట భూముల్లో ఈ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఇటు తెలంగాణలో నల్గొండ, ఖమ్మంతో పాటు చాలా ప్రాంతాల్లో నిమ్మతోటలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ తోటలకు చీడపీడల సమస్య అధికమైంది. మరి ఆ చీడపీడలేంటివి..? వాటిని ఎలా నివారించాలో తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. కె. రవికుమార్.
READ ALSO : కింద కూర్చుని భోజనం చేస్తే మీ గుండె సేఫ్..!
తెగుళ్లను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలు చేపడితే ఆ ప్రభావం దిగుబడిపై అంతగా వుండదు. ఏటా మే, జూన్ నెలల్లో ఎండుకొమ్మలను కత్తిరించి, చెట్లకు గాలీ వెలుతురు దారాళంగా వచ్చేటట్లు చూసుకుంటే గజ్జి తెగులు ఆశించే అవకాశాలు తక్కువగా వుంటాయి. కొత్తగా తోటలు వేసే రైతులు తెగులును తట్టుకునే బాలాజీ రకాన్ని సాగుకు ఎంచుకోవటం ఉత్తమం.