Sucking Pest Management in Cotton Crop
Cotton Crop : ప్రస్తుతం తెగులు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చాలాచోట్ల కలుపు పెరిగిపోయింది. పంట ఎదుగుదల ఆగిపోయింది. ప్రస్తుతం అంతర కృషితో కలుపు నివారణ చేపట్టిన రైతులకు ఇప్పుడు రసంపీల్చే పురుగులు తలనొప్పిగా మారాయి. అయితే వీటి నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పప్పుడు చూద్దాం..
Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు
ఈ ఏడాది సకాలంలో వర్షాలు రాక రైతులు కాస్తా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినా పూర్తి స్థాయిలో సమయానికి అనుకూలంగానే పత్తి పంటను విత్తారు. అయితే ఇటీవల కురిసిన.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా చాలా చోట్ల పంట ఎదుగుదల ఆగిపోయింది. ఇప్పుడిప్పుడే పత్తి రైతులు అంతర కృషి చేసుకొని ఎరువులను వేస్తున్నారు.
ప్రస్తుతం 30 నుండి 60 రోజుల దశలో పంట ఉంది. ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో పూత వస్తోంది. ఈ దశలో అక్కడక్కడ రసంపీల్చు పురుగుల ఉధృతి పెరిగనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చటం వల్ల పెరుగుదల తగ్గిపోయి, దిగుబడులపై ప్రభావం తీవ్రంగా వుంటుంది. వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. రాజేశ్వర్ నాయక్.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు