Pests & Diseases in Paddy crop
Diseases in Paddy crop : తెలంగాణలో రాబోవు ఐదురోజులు కొన్నిచోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సాగుచేస్తున్న వరి పంట ఎక్కువగా చిరుపొట్ట దశ నుండి గింజ గట్టిపడే దశలో ఉంది. ఈ సమయంలో అగ్గితెగులు, కాండం కుళ్లు తెగులు, కాండం తొలిచే పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటివల్ల పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు.
READ ALSO : Paddy Cultivation : వరిలో కాండంతొలుచు పురుగు, సుడిదోమ ఉధృతి… నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు రెండు రోజుల పాటు ఆదిలాబాద్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, పిడుగులు పడే సమయంలో రైతులు, పశువులు, గొర్రెలు, మేకలు చెట్లకింద, నిలబడకూండా చూసుకోవాలి. అలాగే విద్యుత్ స్థంబాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటికుంటలకు దూరంగా ఉండాలి. వర్షాలు కురిసే సూచనలున్నందున కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను.
READ ALSO : Prevention Of Pests : వరిలో చీడపీడల నివారణ, రైతులకు శాస్త్రవేత్తల సూచనలు !
ఇటీవల కురిసిన వడగండ్ల వానలకు .. ముఖ్యంగా పూత దశ నుండి గింజ పాలు సోసుకునే దశలో ఉన్న వరి పైర్లలో గింజ నల్ల మచ్చ తెగులు, అగ్గితెగులు, కాండం కుళ్లు తెగులు, కాండం తొలిచే పురుగులు ఆశించే అవకాశం ఉంది. ఈ దశలో వర్షాలు తగ్గిన తరువాత తెగుళ్ల మందులు పిచికారి చేయాలని సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు.