Pests In Onion : ఉల్లిసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

తామర పురుగులు మడి దశ నుండి పంటను ఆశించి నష్టపరుస్తాయి. పురుగులు ఆకులపై చేరి రసాన్ని పీల్చటం వల్ల కాడలపై తెల్లని లేదా ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి.

Pests In Onion

Pests In Onion : ఉల్లిని వంటకాలల్లో విస్తృతంగా ఉపయోగిస్తుండటంతో దీని సాగువైపు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉల్లి పంటను సాగు చేస్తున్నారు. సరైన యాజమాన్య పద్దతులు పాటించటం ద్వారా రైతులు మంచి దిగుబడితోపాటు, లాభాలు పాటించవచ్చు.

ఉల్లి సాగులో సస్యరక్షణ ;

1. తామర పురుగులు ; తామర పురుగులు మడి దశ నుండి పంటను ఆశించి నష్టపరుస్తాయి. పురుగులు ఆకులపై చేరి రసాన్ని పీల్చటం వల్ల కాడలపై తెల్లని లేదా ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకు చివర నుండి ఎండిపోతుంది. పొలం మొత్తం తెల్లగా కనిపిస్తుంది. పొలం చుట్టూ జొన్న మొక్కలను పెంచి పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. పురుగు ఉనికిని గమనించిన వెంటనే కార్భోసల్పాన్ 2గ్రా, లీటరు నీటికి లేదా ఫిప్రోనిల్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

2. ఆకుమచ్చ తెగులు ; ఈ తెగులు సోకితే ఆకులపై ఊదారంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. గాలిలో తేమ ఎక్కవగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కవగా ఉంటుంది. దీని నివారణకు క్లోరోధాలోనిల్ 2గ్రా లేదా హెక్సాకోనజోల్ 2మి.లీ లీటరు లీటరు కలిపి పిచికారి చేయాలి.

3. నారుకుళ్లు ; నారుమడిలో తేమ ఎక్కవ అయినప్పుడు నారు కుదుళ్లు మెత్తగా అయిపోతాయి. క్రమేపి వాలిపోయి కుళ్లి చనిపోతాయి. విత్తనం నాటే ముందు ధైరం లేదా కాప్టాన్ తో విత్తన శుద్థి చేయాలి. నారుమడి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా లేదా కార్బండిజమ్ 1 గ్రా లీ నీటికి కలిపి పిచికారి చేయాలి.

ట్రెండింగ్ వార్తలు