Pink Bollworm Control in Cotton Farming
Cotton Farming : ప్రస్తుతం తెగులు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది. చాలా ప్రాంతాల్లో కాయ దశలో ఉండగా… ముందుగా వేసిన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పత్తి కాయ పగిలేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సమయంలో గులాబిరంగు పురుగులు, కాయకుళ్ళు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు ఎలాంటి సమగ్రసస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, రాజశేఖర్.
పత్తి రైతులకు ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలాచోట్ల కాయ దశ నుండి కాయ పగిలో దశ వరకు పత్తి పైర్లు ఉన్నాయి. ఈ సమయంలో అక్కడక్కడ పత్తిపంటలో గులాబిరంగు పురుగులు, కాయకుళ్ళు, బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ముఖ్యంగా గులాబిరంగు పురుగు, కాయకుళ్ళు సోకితే పంటలో 30 నుండి 40 శాతం వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, రాజశేఖర్.
Read Also : Natural Cultivation : ప్రకృతి విధానంలో వరిసాగు – వచ్చిన దిగుబడిని సొంతంగా మార్కెట్ చేసుకుంటున్న రైతు