Ullikodu Prevention : వరిలో పంటలో ఉల్లికోడు ఉదృతి.. నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు

వివిధ ప్రాంతాలలో పిలక దశలో వరి పైరు ఉంది. ఈదశలో పిలకలు ఉల్లికాడల వలే పొడవాటి గొట్టాలుగా మారి, పెరుగుదల సరిగా లేదంటూ రైతులు ఆందోళ చెందుతున్నారు.

Ullikodu Prevention

Ullikodu Prevention : వరిసాగుచేసే రైతులకు ఉల్లికోడు తలనొప్పిగా మారింది. ఖమ్మం జిల్లాలో ఈ ఖరీఫ్ లో చేపట్టిన వరికి ఉల్లికోడు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సకాలంలో దీనిని అరికట్టకపోతే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి.

READ ALSO : Kandi Cultivation : కందిలో పెరిగిన చీడపీడల బెడద.. నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

ముఖ్యంగా తెలంగాణలో నియంత్రిత సాగు విధానంతో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. ఇప్పటికే చాలా చోట్ల వరినాట్లు పూర్తయ్యాయి. ఆలస్యంగా నార్లు పోసిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు నాట్లు వేస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లాలో చోట్ల ఉల్లికోడు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

READ ALSO : Rice Cultivation : పొడి విధానంలో వరి సాగు.. తక్కువ పెట్టుబడితోనే పంట దిగుబడులు

వివిధ ప్రాంతాలలో పిలక దశలో వరి పైరు ఉంది. ఈదశలో పిలకలు ఉల్లికాడల వలే పొడవాటి గొట్టాలుగా మారి, పెరుగుదల సరిగా లేదంటూ రైతులు ఆందోళ చెందుతున్నారు. ఇది ఉల్లికోడు వల్ల కలిగే నష్టమంటూ.. నివారణ చర్యలు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ఉల్లికోడు నివారణలో భాగంగా గుళికలను వేసినప్పుడు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం . శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సాగునీటిని అందించాలి.