Banana Cultivation : అరటి సాగులో పిలకల తయారీ, నాటుకునే పద్దతులు

పిలకల దుంపలకు ఏమైనా దెబ్బ తగిలినచో ఆ భాగాన్ని తీసి వేసి నాటాలి. పిలక మొక్కపై భాగంను నరికి పాతినట్లైతే అవి త్వరగా నాటుకొని బాగా పెరుగుతాయి. పిలకలను నాటే ముందు 1% బావిస్టన్ ద్రావణంతో 5 నిమిషాలు ఉంచాలి.

Banana Cultivation : అరటి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానం. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటి పంట ఆక్రమించింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం అరటి పంటను చాలా ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. అరటిలో ప్రాధాన్యత సంతరించుకొన్న రకాలు 70 దాకా ఉన్నాయి. వీటిలో 10-12 రకాలు మన రాష్ట్రంలో విస్తృతంగా సాగు చేస్తున్నారు. కర్పూర చక్కెర కేళి, తెల్ల చక్కెర కేళి, అమృత పాణి లేదా రస్తాళి, తెల్ల చక్కెర కేళి, రోబస్టా, వామన కేళి, బొంత, ఏనుగు బొంత, గైండ్ నైన్ వంటి రకాలు తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనుకూలంగా ఉంటాయి. అరటి ఉష్ణమండలపు పంట సరాసరి 25నుండి30′ సెం.గ్రే. ఉష్ణోగ్రత దీనికి అనుకూలం. 10″సెం.గ్రే లోపు 40సెం.గ్రే కంటే ఎక్కువ ఉండకూడదు. తక్కువ ఉష్ణోగ్రతలో గెలలో పెరుగుదల ఉండదు. అధిక ఉష్ణోగ్రతలో ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల ఎదుగుదల ఆగిపోతుంది.

అరటిని పిలకలు , టిష్యకల్చర్ పద్ధతుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. కొత్తగా అరటి తోట వేయాలనుకుంటే 3 నెలల వయసు గల అరటి పిలకలను తెగుళ్ళు లేని తల్లి చెట్టు నుండి ఎన్నుకోవాలి. సూది మొన ఆకులు గల పిలకలను నాటుకోవటానికి ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి పిలకలు త్వరగా పెరిగి తక్కువ వ్యవధిలో పంట దిగుబడిని ఇస్తాయి. పిలకల దుంపలపై గల పాత వేర్లను తీసివేయాలి. సాధారణంగా దేశవాళి రకాలకు దుంప 1.5-2 కేజీలు కావెండస్ రకాలకు 1.25-1.5 కేజీల బరువు ఉండేలా చూసుకోవాలి.

పిలకల దుంపలకు ఏమైనా దెబ్బ తగిలినచో ఆ భాగాన్ని తీసి వేసి నాటాలి. పిలక మొక్కపై భాగంను నరికి పాతినట్లైతే అవి త్వరగా నాటుకొని బాగా పెరుగుతాయి. పిలకలను నాటే ముందు 1% బావిస్టన్ ద్రావణంతో 5 నిమిషాలు ఉంచాలి. తరువాతనే వాటిని నాటుకోవాలి. అరటిలో ముక్కు పురుగు అధికంగా ఉన్న ప్రాంతాలలో పిలకలను 0.1% మెటాసిస్టాక్స్ ద్రావణంలో ముంచి నాటడం మంచిది.

తోట వేసే ముందుగా నేలను బాగా దున్నాలి. పొట్టి రకాలకు 1.5 మీటర్ల పొడవు రకాలకు 2 మీటర్ల దూరంలో గోతులు తీసి నాటాలి. వర్షాకాంలో జూన్-జూలై మాసాలలోనే నాటుతారు. నీటివసతిని అనుసరించి అక్టోబర్-నవంబర్ మాసం వరకు నాటుకునేందుకు అనుకూల సమయం. నాటే ముందు గుంతలో పశువుల ఎరువు 5 కేజీలు మరియు 5 గ్రాముల కార్బోప్యూరాన్గు ళికలు వేసి గుంత నింపాలి. తరువాత పిలకలను గుంత మధ్యలో దుంప మరియు 2 అడుగుల పిలక భూమిలో కప్పబడి ఉండేటట్లు నాటుకోవాలి. నాటిన పిమ్మట పిలకచుట్టు మట్టిని బాగా కప్పుకోవాలి. అరటి పిలకలు నాటిన 10-15 రోజులకు వేర్లు తొడుగుతాయి. అలా కాని యెడల 20 రోజుల తరువాత నాటిన పిలకల స్థానంలో కొత్త పిలకలు నాటుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు