Mango Cultivation : మామిడితోటల్లో ప్రారంభమైన పూత – ప్రస్తుతం ఆశించే చీడపీడల నివారణ చర్యలు  

Mango Cultivation : పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే.  తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి.

Pre Flowering management in Mango Telugu

Mango Cultivation : చాలా ప్రాంతాల్లో మామిడితోటల్లో పూత ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఇంకా పూత ప్రారంభం కాలేదు.  సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు పూత సమయంలో పాటంచే యాజమాన్యం ఒకఎత్తు.

ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు, ఆశించకుండా  రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.  సమయానుకూలంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితేనే మంచి దిగుబడులను తీయవచ్చని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా, నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు.

పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే.  తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. తోటలు ప్రస్తుతం పూత దశలో వున్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు  అనుకూలంగా వుండటంతో సకాలంలో పూత ప్రారంభమవటంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది.

అయితే, పూత సమయంలో , కాయ పెరిగే దశలో పురుగులు తెగుళ్లు, పురుగులు ఆశించి తోటలకు నష్టం చేస్తాయి. మామిడి పూతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. శ్రవంతి.