Avoid Soil Erosion : నేల కోతకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గాలి వేగం, నీటి ప్రవాహ వేగంతో నేలకోతకు గురై భూసారం కొట్టుకుపోతున్నది. దీంతో పంటల దిగుబడి కూడా తగ్గిపోతుంది.  సారవంతమైన భూమి, వర్షపు నీటి యాజమాన్యం మెట్ట వ్యవసాయానికి మూలాధారం. సాధారణంగా మెట్ట పొలాలు వాలుగా ఉంటాయి.

Soil Erosion

Avoid Soil Erosion : ఎక్కడైతే సారవంతమైన నేలలు ఉంటాయో.. ఆ ప్రాంతం సుసంపన్నంగా, సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పటివరకు నేల నాణ్యంగా, ఆరోగ్యంగా ఉంటుందో అప్పటిదాకా పుడమి తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. భూ ఉపరితలంలో ఉండే పై పొర మట్టి భూమి మనుగడకు ఎంతో అవసరం. కానీ భూ ఉపరితలంపై లభించే ఈ సారవంతమైన మట్టి రోజురోజుకీ క్షీణించి, నాణ్యత లోపించి అనేకమైన సమస్యలను, సవాళ్లను సృష్టిస్తోంది.

READ ALSO : YS Sharmila : టీకాంగ్రెస్ లో షర్మిల కల్లోలం.. తెలంగాణలో షర్మిల రాజకీయానికి నో చెబుతున్న రేవంత్

గాలి వేగం, నీటి ప్రవాహ వేగంతో నేలకోతకు గురై భూసారం కొట్టుకుపోతున్నది. దీంతో పంటల దిగుబడి కూడా తగ్గిపోతుంది.  సారవంతమైన భూమి, వర్షపు నీటి యాజమాన్యం మెట్ట వ్యవసాయానికి మూలాధారం. సాధారణంగా మెట్ట పొలాలు వాలుగా ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే వాన తాకిడికి నేల కోతకు గురి అవుతుంది.  నేలపై భాగంలో ఉన్న సారవంతమైన మట్టి పొర పంట పెరుగుదలకు చాలా ముఖ్యo.

READ ALSO : Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు

మొక్కల వ్రేళ్ళు చాలా వరకు ఈ పై పొలం లోనే ఉంటాయి. కాబట్టి నేల పై భాగంలో మట్టి పొర కొట్టుకొని పోయినపుడు క్రింద వున్న నేల తక్కువ సారవంతంగా ఉండటం వలన ఈ నేలలో పంటల దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతే కాదు ఇలా కొట్టుకొని పోయిన ఒండ్రు మట్టి చెరువులోకి చేరుకొని, పూడిక లాగా పోగు పడుతుంది.

READ ALSO : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి

కాబట్టి సారవంతమైన మట్టి కొట్టుకొని పోకుండా ఉండాలంలే రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ రాజేశ్వరనాయక్.