Matti Manishi
Milk Production : ఏ కాలంలో ఉండే సమస్యలు ఆ కాలంలో ఉంటాయి. ఇది మనుషులకే కాదు మూగజీవాలకు కూడా వర్తిస్తుంది. పాడిపరిశ్రమ విషయంలో వేసవిలో అధిక జాగ్రత్తలు తీసుకునే రైతులు చలి కాలంలో కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు.
Read Also : Technologies In Agriculture : వ్యవసాయ పనులు చేస్తున్న రోబో.. రెండు రూపాయల ఖర్చుతోనే ఎకరంలో కలుపుతీత
సాధారణంగా శీతాకాలంలో పశువులు సరిగా మేత మేయక పాల దిగుబడి తగ్గుతుంది. ఈ కాలంలోనే గేదెలు ఎక్కువగా ఎదకు వస్తుంటాయి. ఈ క్రమంలో శీతాకాలంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ వాటికి అందించే దాణాల్లో తగు మార్పులు చేసుకుంటూ సమయానుకూలంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తేనే పాడిపరిశ్రమ లాభసాటిగా ఉంటుంది.
వ్యవసాయరంగానికి అనుబంధంగా పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. అయితే ప్రస్తుతం శీతాకాలం కావడం పశువులు సరిగ్గా మేత తినక పాల దిగుబడి తగ్గుతుంటుంది . అందుకే పశువులకు శీతాకాలం ఒక గడ్డు కాలం అంటుంటారు.
ఈకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, సమస్యలు ఎదురవుతూనే వుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పశువుల శరీరం వేడిగా ఉండేందుకు కావాల్సిన ఆహారాన్ని అందించాలి.
లేని పక్షంలో మేత సరిగా తినక పాల దిగుబడి తగ్గే ప్రమాదముంది. అంతే కాదు చలికాలంలో అనేక వైరస్ లు, దోమలు వ్యాప్తి చెందడం వల్ల గేదెలు రోగాల భారీన పడతాయి. పశువులను ఉంచిన షెడ్ల చుట్టూ గోనెసంచులు అమర్చాలి.
ఇక వాటికి ఇచ్చే ఆహారంలో పోషక విలువలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మరిన్ని వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, వెంకట రామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. కె. ఆనందరావు.