Prevention Of Pests In Paddy Crop
Prevention Of Pests In Paddy Crop : నీటివసతి కింద, రబీ వరినాట్లకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే చలికాలం కావడంతో వరి నారుమళ్లలో ఎదుగుదల అంతగా ఉండదు. దీంతో పాటు తొలిదశలో వచ్చే మొగిపురుగు, ఆకుచుట్టుపురుగు, అగ్గితెగులు లాంటివి తీవ్రంగా నష్టం చేస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి ..
Read Also : Pests in Chilli Cultivation : మిరప తోటల్లో పురుగులు, తెగుళ్ల ఉధృతి.. చీడపీడల నివారణ
వరిసాగులో చీడపీడల నివారణ :
రబీ వరినాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల వరినాటువేసి 10 నుండి 15 రోజుల పైరు ఉంది. అయితే నాట్లు వేసేవారు. ఇప్పటికే వేసిన రైతులు తొలిదశలో వచ్చే చీడపీడల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మొగిపురుగు, ఆకుచుట్టుపురుగు, అగ్గితెగులు, వేరుకుళ్లు లాంటివి తీవ్రంగా నష్టం చేస్తుంటాయి.
కనుక తొలిదశలోనే వాటికి నివారణ చర్యలు చేపట్టాలి. అంతే కాదు ప్రస్తుతం శీతాకాలం కావడం , చలితీవ్రత పెరుగుండటంతో వరి నారు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు వరిసాగులో ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి.
మొగి పురుగు నివారణ
ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలు 10 కి.చల్లుకోవాలి
ఎకరాకు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4 గుళికలు 8 కి. చల్లుకోవాలి
ఎకరాకు డ్యూఫాంట్ ఫెట్యూరా 4 కి. చల్లుకోవాలి
ఆకుచుట్టు పురుగు నివారణ
ఎసిఫేట్ 1.5 గ్రా.
లీటరు నీటికి కలిపి
పిచికారి చేయాలి
వేపనూనె 5 మి. లీ.
లీటరు నీటికి కలిపి
పిచికారి చేయాలి
ఆకుచుట్టు పురుగు, మొగిపురుగు నివారణ
క్లోరోఫైరిఫాస్ 2 మి. లీ.
వేపనూనె 5 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
లాంమ్డాసైహాలోత్రిన్ 1 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
కొరాజిన్ 0.3 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
ప్లూబెండమైడ్ (ఫేమ్) 20 డబ్యూజి 0.25 గ్రా.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
ప్లూబెండమైడ్ 480 ఎస్ఏ 0.2 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
అగ్గితెగులు నివారణ
సివిక్ లేదా బీమ్ ట్రైసైక్లోజోల్ 0.2 గ్రా.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
వేరుకుళ్లు తెగులు నివారణ
కాపర్ సల్ఫైడ్ లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇసుకలో కలిపి చల్లుకోవాలి
Read Also : Ragi Cultivation : రాగిలో ఎరువులు, చీడపీడల నివారణ.. సమగ్ర యాజమాన్య పద్ధతులు