Groundnut Crop
Groundnut Crop : నూనె గింజల పంటలలో వేరుశనగ ప్రధానమైన పంటగా చెప్పవచ్చే రవీ, వేసవిలో ఆరుతడి ఫంటగా వేరుశనగను చెరువులు ,బోరుబావులు క్రింద సొగుచేస్తారు. ముఖ్యంగా రాయలసీమలోని జిల్లాలతోపాటుగా, ఉత్తర కోస్తాలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం
జిల్లాల్లోనూ, తెలంగాణ రాష్టంలో మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, నల్గొండ మరియు ఖమ్మం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. నాణ్యమైన,
అధిక బగుబడునిచ్చే రకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నా చీడపీడలు అధికం కావటం, రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకోకపోవటం కారణంగా పంట దిగుబడి తగ్గుతుంది.
READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు
రబీ వేరుశనగ పంటలో పూత దశ నుండి కాయలు ముదిరే దశ వరకు వివిధ రకాల చీడపీడలు ఆశించి పంటకు నష్టం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కాండం
కుళ్ళు తెగుళ్ళు ఆశించి పంటకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి.
కాండం కుళ్ళు తెగులు ;
ఈ తెగులు విత్తిన 70 రోజుల తర్వాత నుండి పంట చివర వరకు ఆశించును. ప్రధానంగా ఈ తెగులు కాండంను, ఊడలు మరియు కాయలను ఆశిస్తుంది. భూమి పైభాగాన ఉన్న కాండం మీద తెల్లటి బూజు తెరలుగా ఏర్పడి ఆ తరువాత ప్రతికూల పరిస్థితులలో తెల్లటి బూజులో ఆవగింజ పరిమాణంలో ఉన్న శిలీంద్ర సిద్ధ బీజాలు ఏర్పడతాయి.
తెగులు ఆశించిన మొక్క మొదళ్ళలోని శాఖలు, ఊడలు ఎండిపోతాయి. ఆశించిన మొక్కలను పీకినపుడు నేలపై ఉన్న పైభాగాలు మాత్రమే ఊడివస్తాయి. వేర్లు మరియు కాయలు నేలలోనే ఉండిపోతాయి. భూమి మరియు విత్తనం ద్వారా ఈ శిలీంధ్రం వ్యాపిస్తుంది.
READ ALSO : Cultivation of vegetables : ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు
నివారణ :
* వేసవిలో లోతైన దుక్కులు దున్నుకోవాలి.
* ఆరోగ్యవంతమైన విత్తనం ఎన్నుకోవాలి.
* ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులును అదుపులో ఉంచినచో ఈ తెగులు ఉధృతి కొంత మేరకు తగ్గుతుంది.
* ఒక కిలో విత్తనానికి 3 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1 గ్రా. కార్చండిజమ్ లేదా టిబుకొనజోల్ 2% డి.ఎస్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
READ ALSO : Pesara Farming :పెసరలో ఎర్రగొంగళి పురుగు బెడద.. నివారణకు చేపట్టాల్సిన చర్యలు
* రెండు కిలోల టటైకోడెర్మా విరిడిని 90 కిలోల పశువుల ఎరువు మరియు అర కిలో బెల్లం కలిపి చెట్టు నీడన పాలిథిన్ కాగితం కప్పి 15 రోజులపాటు వృద్ధి చేసుకొని ఒక ఎకరా భూమిలో పదునులో విత్తే ముందు వేసుకోవాలి.
* తెగులు సోకిన మొక్కలు పీకి నావనం చేసి చుట్టూ గల నేలను 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 1 గ్రా. కార్బండిజమ్ ఒక లీటరు నీటిలో కలిపి నాజిల్ తీని నేలను తడిసేటట్లు పోయాలి.