Vedha Paddy : వెద పద్ధతిలోనే వరిసాగు చేస్తున్న రైతులు

Vedha Paddy : వెద పద్ధతిలోనే వరిసాగు చేస్తున్న రైతులు

Profitable Crop Vedha Paddy

Vedha Paddy : వరిసాగుకు ముందుగా నారు పోయాలి.. తర్వాత నాట్లు పెట్టాలి. ఇందుకు కూలీల అవసరం ఉంటుంది. కూలీల కొరత ఉంటే నాట్లు ఆలస్యమై దిగుబడి తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వెద పద్ధతిని ఎంచుకొని మంచి ఫలితాలు సాధిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన కొందరు రైతులు. నాలుగైదేళ్లుగా ఈ పద్ధతి ద్వారానే వరిసాగు చేస్తూ అధిక దిగుబడి సాధించడంతో పాటు ఎకరాకు రూ.5 నుండి 6 వేల వరకు వరకు పెట్టుబడి ఆదా చేసుకుంటున్నారు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం చేయాలంటే అన్నదాతకు సవాళ్లతో కూడుకున్న సమస్య. ఏ చిన్న పనికైనా ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుక్కిదున్ని నారు పోసిన కాడి నుంచి కుప్పనూర్చే వరకు సవాలక్ష్య సమస్యలను అధిగమించాల్సివస్తోంది.

దీంతో కొంత మంది రైతులు పాత పద్ధతిలో వడ్లను వెదజల్లే పద్ధతినే అవలంబిస్తూ సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, పొనుగుమాడు గ్రామంలోని రైతులంతా వెదపద్ధతిలో వరిసాగుచేసి మంచి దిగుబడులను పొందుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదిగో ఇక్కడ చూడండీ.. ఈ వరి పోలాలను.. ఇప్పటికే నేరుగా ట్రాక్టర్ తో వరి విత్తనం వేసిన పొలంతో పాటు ఇప్పుడే విత్తనాన్ని వేస్తున్న పొలం.  ఇక్కడి రైతులంతా  5 ఏళ్లుగా వెదజల్లే పద్ధతిలో వరిసాగుచేస్తున్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో సాగును చేపడుతున్నారు. తక్కువ సాగునీటితో అధిక దిగుబడులు సాధిస్తూ.. పలు ప్రశంసలు అందుకుంటున్నారు. అంతే కాదు.. వీళ్లు చేసే వ్యవసాయాన్ని చుట్టుప్రక్కల రైతులు చూసి వారు కూడా  ఆచరిస్తున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు