Turmeric Cultivation : పసుపుసాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులు

పసుపులో మొక్కజొన్న అంతరపంటగా. వేస్తారు. రెండు సాళ్ళ వసుపుకి ఒక సాలు మొక్కజొన్న వేయాలి. అదే విధంగా 10-12 పనువు సాళ్ళకు 1 వరున ఆముదమును కూడ వేసుకోవచ్చును. మామిడి తోటలు చిన్నగా ఉన్నప్పుడు అంతర పంటగా పసుపు వేసుకోవచ్చును.

turmeric cultivation

Turmeric Cultivation : సుగంధ ద్రవ్య పంటలలో భారతదేశంలో పసుపు వంట వ్రధానమైనది. మన దేశములో సగానికి సగం పసుపు తెలంగాణ మరియు ఆంధ్రవ్రదేశ్‌లలో ఉత్పత్తి అవుతుంది. పసుపు దుంపల్లోని కర్ముమిన్‌, సుగంధతైలము వల్ల దీనిని ఆహార పదార్థాలకు రంగు, రుచ్చి సువాసనల కోసం ఔషదాలలో , చర్మ సౌందర్యానికి, రంగుల పరిశ్రమలలో వాడుతారు.

READ ALSO : Israel-Gaza war : నీటి కొరతతో రోజుల తరబడిగా స్నానం చేయని గాజా వాసులు

పంటకు అనువైన నేలలు : బలమైన నేలలు పసుపు పండించటానికి అనుకూలము. నీరు బాగా ఇంకే గరపనేలలు, ఉదజని సూచిక 6-7.5 మధ్య ఉండి సేంద్రియ పదార్ధం బాగా ఉన్న భూములు పసుపు పంటకు అనుకూలంగా ఉంటాయి. పసుపు పంట నీటి ముంవును తట్టుకోలేదు. ఉవ్పునేలలు, క్షారనేలలు పనికిరావు. స్వల్పకాలిక రకాలకు మే చివరి వారం, మధ్యస్ధ రకాలకు జూన్‌ 1నుండి జూన్‌ 15 వరకు, దీర్ఘకాలిక రకాలకు జూన్ 15 నుండి జూన్ 30 వరకు విత్తుకునేందుకు అనుకూల సమయం.

అనువైన విత్తన రకాలు : దుగ్గిరాల (ఎరువు, తెలువు), మైదుకూరు,టేకూరిపేట, ఆర్మూర్‌, సేలమ్‌, రంగా, రళ్ళి, రోమ, నురోమ, రాజావురి, వ్రభ, ప్రతిభ, అలెప్పి సుప్రీమ్‌, కేదారమ్‌, నుగుణ, సుదర్శన, ఏసిసి 79 యన్‌డిహెచ్‌ 79, యన్‌డిహెచ్‌ 96, ప్రగతి 48, రాజేంద్ర సోనాలి, రాజేంద్ర సోనియా, కస్తూరి పసువు ముఖ్యమైనవి. విత్తన మోతాదుకు సంబంధించి తల్లి దుంపలు – 1000 కిలోలు/ఏకరానికి, పిల్ల దుంపలు – 800-1000 కిలోలు/ఎకరానికి విత్తన మోతాదు అవసరం అవుతుంది.

READ ALSO : Integrated Farming : ప్రణాళిక బద్ధంగా సమీకృత వ్యవసాయం.. కొబ్బరితో పాటు చేపలు , కోళ్లు పెంపకం

ఒంటి కన్ను ముచ్చెల వాడకం:

ఆ సాధారణంగా రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ళ వరకు విత్తనాన్ని వాడుతున్నారు. బలమైన కొమ్ములే ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో దొడ్డు విత్తనాన్న’పెద్ద కొమ్ములను అలాగే వేస్తుండటం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కణువుల వద్ద ముక్కలుగా కోసి ఒంటి కన్ను ముచ్చెలను బోదెలకు ఒక వైవున మొక్కజొన్నలో మిశ్రమ పంటగా విత్తుకోవాలి. దీనివల్ల ప్రతి కణుపు గల ముచ్చె ఒక మొక్కగా మారి ఎకరాకు 2 క్వింటాళ్ళ విత్తనం సరిపోతుంది. దీంతో ఎకరానికి 8 క్వింటాళ్ళ విత్తనం ఆదా అవుతుంది. విత్రనము తక్కువగా ఉన్నప్పుడు ఒక కణుపు లేదా రెండు కణువుల కొమ్ములు ప్రాట్రేలలో ప్రవర్థనం ద్వారా విత్తనరేటును తగ్గించుకోవచ్చును.

విత్తన శుద్ధి ;

విత్తన దుంపలని మాంకోజెబ్‌ 2గ్రా. (లేదా). కార్చండాజిమ్‌ 1గ్రా. (లేదా) రిడోమిల్‌ 2గ్రా. చొవ్చున ఒక లీటరు నీటికి (లేదా) ఏదేని ఒక శిలీంద్రనాశని మందుతో మోనోత్రోటోఫాన్‌ 1.5 మి.లీ/లీటరు, లేదా క్లోరిపైరిఫాస్‌ 2 మి.లీ/లీటరు (లేదా) ఇమిడాక్లోఫిడ్ 1మి.లీ/3 లీటర్ల నీటికి కలివిన ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టాలి. తరువాత నీడలో ఆరబెట్టి. వెంటనే విత్తుకోవాలి. దీని వల్ల శిలీంద్రాలు మరియు పురుగుల బారి నుండి రక్షణ కలుగుతుంది.

READ ALSO : Mixed Farming : మిశ్రమ వ్యవసాయంతోనే లాభాలు

విత్తే దూరము :

బోదె సాళ్ళ పద్ధతి : ఈ పద్ధతిలో 45 సెం.మీ ఉండే బోదెలను తయారు చేసుకొని, బోదెల మీద 20 సెం.మీ ల దూరంలో దుంపలను నాటుకోవాలి (45౫20 సెం.మీ).

ఎత్తు మడుల పద్ధతి ; బెడ్‌ పొడవు అవసరం మేరకు పెట్టుకోవాలి. బెడ్‌ వెడల్పు 90 సెం.మీ, బెడ్‌ ఎత్తు 20-30 సెం.మీ., బెడ్‌ల మధ్య కాలువ వెడల్పు 30 సెం.మీ, బెడ్‌ మీద రెండు వరుసల మధ్య దూరం 45 సెం.మీ, రెండు మొక్కల మధ్య దూరం 225 సెం.మీ ఉండేలా చూసుకోవాలి. ఎత్తు మడులను చేసుకొని బిందు సేద్య పద్ధతి ద్వారా నీరు అందించినట్లయితే దుంపలు బాగా ఊరడమే కాకుండా, దుంప కుళ్ళును తగ్గించుకోవచ్చును.

అంతర పంటలు : పసుపులో మొక్కజొన్న అంతరపంటగా. వేస్తారు. రెండు సాళ్ళ వసుపుకి ఒక సాలు మొక్కజొన్న వేయాలి. అదే విధంగా 10-12 పనువు సాళ్ళకు 1 వరున ఆముదమును కూడ వేసుకోవచ్చును. మామిడి తోటలు చిన్నగా ఉన్నప్పుడు అంతర పంటగా పసుపు వేసుకోవచ్చును.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

పంటమార్చిడి : మొక్కజొన్న సోయాచిక్కుడు వంటి పంటలతో పంటమార్పిడి చేయాలి. పనుపు వేసిన పాలంలో రెండు సంవత్సరాల వరకు అదే వంట వేయకూడదు. రైతులు అధిక మోతాదులో పశువుల ఎరువు చెరువు మట్టి వేయడం వల్ల నేలలో తేమ శాతం పెరిగి దుంవకుళ్ళు ఆశించడానికి అస్కారం ఉంటుంది. కాబట్టి సిఫారుసు చేసిన మేరకే సేంద్రియ ఎరువులను వేసుకోవాలి. నాణ్యమైన వేప పిండిని తప్పకుండా వేసుకోవాలి.