Food For Fish : చేపలకు ఆహారంగా గుమ్మడికాయలు.. పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటున్న రైతులు

తుల వద్ద కూరగాయలు ఉన్న విషయం తెలిసిన చేపల చెరువుల నిర్వాహకులు గుమ్మడికాయలను వారే కోత కోయించి చెరువుల వద్దకు తెచ్చి ప్రతిరోజు చేపలకు అహారంగా పెడుతున్నారు.

food for fish

Food For Fish : చేపలు పెంపంకం చేపట్టే రైతులు రూటు మార్చారు. ఇటు వాతావరణంలో వచ్చే పెనుమార్పులతో వైరస్ లు విజృబిస్తుండటం.. వాటి నివారణకు అధిక ఖర్చు చేస్తుండటం.. మరోవైపు మార్కెట్ లో  దాణా ధరలు కూడా అధికంగా పెరగడంతో రైతులకు  పెట్టుబడి ఖర్చులు తడిసి మోపవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ లో గుమ్మడి ధరలు తగ్గడంతో వీటినే చేపలకు మేతగా వాడుతూ… పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రైతులు.

READ ALSO : Tobacco Leaf Picking : పొగాకు ఆకులను దండకుట్టే మిషన్ తో తీరిన కూలీల సమస్య !

నర్సాపురం మండలంలో రైతులు కూరగాయల పంటలను అత్యధికంగా సాగు చేస్తుంటారు. దీంతో మార్కెట్‌లో ధరలు తగ్గాయి. పెట్టుబడులు కూడా రాకపోవటంతో కొందరు కూరగాయలపై అశలు వదిలేశారు. రైతుల వద్ద కూరగాయలు ఉన్న విషయం తెలిసిన చేపల చెరువుల నిర్వాహకులు గుమ్మడికాయలను వారే కోత కోయించి చెరువుల వద్దకు తెచ్చి ప్రతిరోజు చేపలకు అహారంగా పెడుతున్నారు.

READ ALSO : Pady Crop Cultivation : ఖరీఫ్ కు అనువైన రాజేంద్రనగర్ వరి రకాలు

పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం మండం, కొప్పర్రు గ్రామానికి చెందిన రైతు నాగేశ్వర రావు.. చేపలకు గుమ్మడినే మేతగా వేస్తూ.. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటున్నారు. చేపలు కూడా గుమ్మడికాయలను రోజు బాగా తింటున్నాయని తెలిపారు. చేపలకు మేత ధరలు కూడా పెరగటంతో గుమ్మడికాయల ధరలు తగ్గటంతో వాటినే వాడుతున్నామని రైతు చెబుతున్నారు. ప్రజలు కూడా చేపలు కూరగాయలు తినటం చాలా మంచిది అని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు