Rains Alert : తొలకరి కురిసే.. రైతన్న మురిసే.. పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు

Rains Alert : మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారం వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు.

Rains Alert : తొలకరి వర్షం పలకరించింది. రెండు నెలలుగా ఎండల తాకిడికి ఎదుర్కొన్న నేల రెండు వారం రోజులుగా కురుస్తున్న చిరుజల్లులకు పులకరించిపోతుంది. నైరుతి రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం పడుతున్న చిరుజల్లులకు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు పలకరించాయి. తెలుగు రాష్ట్రాల్లో పత్తి విత్తనాలను విత్తుకోవడానికి రైతులు దుక్కులను దున్నకుని సిద్ధంగా ఉన్నారు. అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు కొంత మంది రైతులు విత్తనాలును వేస్తుండగా.. మరికొంత మంది మంచి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. నాన్‌ ఆయకట్టు ప్రాంతంలో కొంత మంది రైతులు దీర్ఘకాలిక వరి రకాలను నారుమడులు పోస్తున్నారు. మూడు నాలుగు రోజులుగా అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారం వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తారు. మరికొన్ని చోట్ల విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్నారు. అదునైన వర్షం కురిస్తే అంతటా పత్తి విత్తనాలు పెద్ద ఎత్తున విత్తుకునే అవకాశం ఉంది.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ట్రెండింగ్ వార్తలు