Rajma Cultivation
Rajma Cultivation : విశాఖ ఏజెన్సీ ఆదివాసీ రైతులకు నాణ్యమైన రాజ్‌మా వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. అధిక దిగుబడినిచ్చే మేలిజాతి విత్తనాలను రైతులకు అందించాలనే లక్ష్యంతో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రాజ్‌మా వంగడాల ఉత్పత్తిపై పరిశోధనలు చేశారు. ఇప్పటికే రైతులకు అందుబాటులో అరుణ్, ఉత్కర్స్ రకాలు రాగా ఇటీవల మరో నూతన రకాన్ని రూపొందించింది. ఈ రకం గుణగణాలు.. సాగు యాజమాన్యం గురించి ఇప్పుడు చూద్దాం.
విశాఖ జిల్లా , చింతపల్లి ఏజెన్సీ రైతులు కొన్నేళ్లుగా రాజ్‌మా పంటను రెండో వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. రాజ్‌మా జిల్లాలో మాత్రమే సాగుకు అనుకూలం. ఇతర ప్రాంతాల్లో రాజ్‌మా పంట పండేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు అందుబాటులో లేవు. పదేళ్ల క్రితం వరకు ఆదివాసీ రైతులు సుమారు 45 వేల హెక్టార్లులో రాజ్‌మాను సాగు చేసేవారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటను నష్టపోవడం, కనీసం విత్తనాలు కూడా చేతికి అందకపోవడం వల్ల కాలక్రమంగా గిరిజన ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది.
గత ఏడాది చింతపల్లి, జీకేవీధి మండలాల్లో అధికంగా ఆరు వేల ఎకరాల్లో రాజ్‌మా సాగు జరుగింది. ఆదివాసీ రైతులు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్లనే రాజ్‌మా పంటకు దూరమవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన చింతపల్లి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు నూతన రాజ్‌మా వంగడాలపై పలు పరిశోధనలు ప్రారంభించింది.
ఇప్పటికే రెండు రకాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు.. ప్రస్తుతం మరో నూతన రకం జ్వాలను తీసుకొచ్చారు. ఈ రకం గుణగణాలు సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సందీప్ నాయక్.
Read Also : Lemon Farming Methods : నిమ్మతోటల్లో పూత నియంత్రణ యాజమాన్యం.. అధిక దిగుబడులకు మేలైన సూచనలు