Sulfur Deficiencies : పంట పొలాల్లో గంధకం లోపాలకు కారణాలు, నివారణ చర్యలు !

పైరు లేత పసుపు రంగు లక్షణాలు లేత ఆకుల్లో ఉండే గంధకపు లోప లక్షణాలు అదే నత్రజని లోపమయితే ముదురాకులో పసుపు రంగు కనిపిస్తుంది. ఆకులు మందంగా మొక్క కాండం సన్నగా సున్నితంగా పొట్టిగా ఎదుగుదల సరిగ్గా ఉండదు.

Sulfur Deficiencies : మొక్కలకు అవసరమైన పోషకాలలో గంధకం చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. గంధకాన్ని ఉపపోషకాల జాబితాలో చేర్చినప్పటికీ అవి ముఖ్య పోషకాలయిన నత్రజని , భాస్వరం, పొటాష్ ల తరువాత నాలుగవ స్ధానాన్ని ఆక్రమిస్తుంది. మొక్కలు గంధకాన్ని నేల నుండి వేర్ల ద్వారా సల్ఫేట్ రూపంలో వాతావరణం నుండి ఆకుల ద్వారా సల్ఫర్ ఆక్సైడ్ రూపంలో తీసుకుంటాయి.

గంధకం లోపాలకు కారణాలు ; ఒక నెలలో ఒకే పంటను పంట తరువాత పంటగా పండిస్తూ సాంద్ర వ్యవసాయంలో గంధకం ఎక్కువగా అవసరం ఉండే నూనె గింజలు , పప్పు ధాన్యాల పంటలకు గంధం తక్కువగా ఉండే రసాయనాలను వాడటం, తేలికపాటి నేలల్లో , అధిక వర్షపాతం ఉన్న చల్లని ప్రాంతాల్లో సేంద్రియ పదార్ధం తక్కువగా ఉన్న నేలల్లో గంధకం లోపం కనిపిస్తుంది.

గంధకం వల్ల ప్రయోజనాలు ; మొక్కలకు కావలసిని అమైనో అమ్లాలు, ఎంజైముల తయారీకి సహకరిస్తుంది. కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరగటానికి నత్రజని స్థిరీకరింపచేసి సూక్ష్మ జీవుల చర్య శక్తి వంతంగా ఉండటానికి తోడ్పడుతుంది.

చెరకు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, కొబ్బరి, పొగాకులో పంట నాణ్యతను కూరగాయల్లో పోషక విలువలను పెంచుతుంది. పప్పుజాతి పైర్లలో వేరు బుడిపెల తయారీకి అన్ని పంటలలో జరిగే విత్తన తయారీకి కీలక పాత్ర వహిస్తుంది. నూనె గింజల పైర్లలో మాంసకృత్తులు , నూనె తయారీకి , నూనె శాతం పెంచటానికి దోహదపడుతుంది. నీరుల్లికి, వెల్లులికి ఘాటు రావటానికి తోడ్పడుతుంది. విటమిన్లు, మాంసకృత్తులో గంధకం ఒక భాగంగా ఉంటుంది. భూమిలో తగినంత గంధకం ఉన్నప్పుడు పశువుల మేతకు ఉపయోగపడే జొన్న మొదలకు పైర్ల లో ఉండే విషతీవ్రత తగ్గుతుంది.

గంధకం లోపం లక్షణాలు ; పైరు లేత పసుపు రంగు లక్షణాలు లేత ఆకుల్లో ఉండే గంధకపు లోప లక్షణాలు అదే నత్రజని లోపమయితే ముదురాకులో పసుపు రంగు కనిపిస్తుంది. ఆకులు మందంగా మొక్క కాండం సన్నగా సున్నితంగా పొట్టిగా ఎదుగుదల సరిగ్గా ఉండదు. పూత రావటం, ధాన్యపు పంటలు పక్వానికి రావడం ఆలస్యమవుతుంది.

గంధకం లోపాన్ని నివారించుకోవటానికి గంధకం కలిగిన ఎరువులను పంటలకు అందించాలి. అమ్మోనియం సల్ఫేట్, జిప్సం, సల్ఫర్ మూలకం, సింగిల్ సూపర్ ఫాస్పేట్, పొటాషియం సల్ఫేట్, జింక్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్, అమ్మోనియం ఫాస్పేట్ సల్ఫేట్ వంటి ఎరువులను వాడుకోవటం ద్వారా గంధకం లోపాన్ని నివారించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు