Broad Beans
Broad Beans Cultivation : ఉభయ తెలుగు రాష్ట్రాలలో పండించే కూరగాయల పంటలలో చిక్కుడు ఒకటి. వీటిలో అనేక రకాలున్నా పందిర్లు అవసరం లేని పాదుచిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా వుంది.
READ ALSO : Silkworm Cultivation : వరికి ప్రత్యామ్నాయంగా పట్టుపురుగుల పెంపకం
ప్రస్తుతం ఈ పైరు పూత నుండి కాయ తయారయ్యే వరకు వివిధ దశల్లో వుంది. ఈ పంటకు చాలా చోట్ల వేరుకుళ్లు తెగులు ఆశించి తీవ్రనష్టం చేస్తోంది. కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగును అరికట్టవచ్చంటూ, యాజమాన్యచర్యలను తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డా. జే. హేమంత్ కుమార్.
READ ALSO : Murrel Fish : నూతన టెక్నాలజీతో కొరమేను పిల్లల ఉత్పత్తి ..తక్కువ సమయంలోనే అధిక దిగుబడి అంటున్న రైతు
మార్కెట్ లో చిక్కుడుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా చాలా మంది రైతులు చిక్కుడు పంటను సాగుచేశారు. ప్రస్తుతం పూత దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చిక్కుడు పంటకు వేరుకుళ్లు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు మొలక దశనుండి కోత దశవరకు వచ్చే అవకాశం ఉంది.
READ ALSO : Laptops Price in India : పీసీల దిగుమతులపై ఆంక్షల ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న ల్యాప్‌టాప్‌ల ధరలు..!
ఇది ఆశించిన ప్రాంతాల్లో రైతులు జాగ్రత్తగా ఉంటూ, సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే మంచి దిగుబడిని పొందే అవకాశం ఉంటుందని, తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డా. జే. హేమంత్ కుమార్.
READ ALSO : సబ్‌స్క్రైబర్లు అత్యధికంగా ఉన్న యూట్యూబ్ ఛానెళ్లు..
సాధారణంగా ఈ తెగులు ఒక మొక్కనుండి మరోమెక్కకు ఆశిస్తుంది. కాబట్టి తెగులు సోకిన మొక్కల నుండి మంచి మొక్కలను నీరు పారించవద్దు. తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయడం ద్వారా ఇతర మొక్కలకు ఆశించకుండా ఉండి, మంచి దిగుబడిని సాధించేందుకు ఆస్కారముంటుంది.